News March 20, 2024
నా ఫోన్ కాల్ రికార్డ్ చేశాడు: పొన్నం

TG: హనుమకొండ ఆర్డీవో తన ఫోన్ కాల్ రికార్డ్ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయనపై సీఎస్ శాంతికుమారికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్తో కరవు వచ్చిందంటూ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పొన్నం మండిపడ్డారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
Similar News
News September 8, 2025
వెంకటగిరి జాతర.. ఈ స్వీట్ టేస్ట్ చూడండి!

వెంకటగిరి అనగానే గుర్తుకు వచ్చేది పోలేరమ్మ జాతర, చీరలు. అయితే మరో రుచికరమైన స్వీట్ కూడా ఉంది. అదే వందేళ్ల పైగా చరిత్ర కలిగిన కమలమ్మ మైసూర్ పాక్. జీడిపప్పు, స్వచ్చమైన నెయ్యి, చక్కరతో జీడిపప్పు మైసూర్ పాక్ తయారు చేస్తున్నారు. దీనిని కమలమ్మ తయారీ చేయడంతో కమలమ్మ మైసూర్ పాక్ లేదా వెంకటగిరి జీడిపప్పు మైసూరు పాక్ అని పిలుస్తారు. వెంకటగిరిలో ఈ స్వీట్ రుచి మీరు చూశారా?
News September 8, 2025
విటమిన్ల కోసం ఇవి తినండి!

విటమిన్ A- క్యారెట్లు, కాలేయం. B1 – తృణధాన్యాలు, చిక్కుళ్లు. B2 – పాలు, గుడ్లు, పాలకూర. B3 – చికెన్, వేరుశనగ. B5 – అవకాడో, గుడ్లు. B6 – అరటిపండు, సాల్మన్ చేప, ఆలుగడ్డలు. B7 – గుడ్లు, బాదం, కాలీఫ్లవర్. B9 – ఆకుకూరలు, పప్పులు, సిట్రస్. B12 – చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు. విటమిన్ D – సూర్యకాంతి, చేపలు, పాలు. K- కాలే, బ్రోకలీ, సోయాబీన్. E – పొద్దుతిరుగుడు గింజలు, బాదం. C – నారింజ, జామ. SHARE IT
News September 8, 2025
బదిలీలపై చివరి దశకు కసరత్తు!

AP: ఆల్ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలపై కసరత్తు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై నిన్న CS, DGP, CMO అధికారులతో CM చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. JCల నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీలు.. SPల నుంచి DIG, IGల వరకు కీలక పోస్టుల్లో కొత్త అధికారులు వచ్చే అవకాశముందని చెబుతున్నాయి. సరైన స్థానంలో సరైన అధికారి అనే కాన్సెప్ట్ కోసం CM కసరత్తు చేస్తున్నారని పేర్కొంటున్నాయి.