News March 20, 2024

నా ఫోన్ కాల్ రికార్డ్ చేశాడు: పొన్నం

image

TG: హనుమకొండ ఆర్డీవో తన ఫోన్ కాల్ రికార్డ్ చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పంపించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయనపై సీఎస్‌ శాంతికుమారికి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌తో కరవు వచ్చిందంటూ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పొన్నం మండిపడ్డారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Similar News

News December 16, 2025

సిడ్నీ దాడి.. నిందితులకు హైదరాబాద్‌ లింక్!

image

ఆస్ట్రేలియాలో కాల్పులకు తెగబడిన <<18568131>>తండ్రీకొడుకుల<<>> మూలాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ‘సాజిద్ అక్రమ్(50)ది ఓల్డ్ సిటీ. ఇద్దరు సోదరులు, బంధువులు అక్కడే ఉన్నారు. 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డాడు. ఆస్తి పంపకాల కోసం గతంలో ఇండియాకు వచ్చాడు. అతడి కొడుకు నవీద్‌కు పుట్టుకతో ఆసీస్ పౌరసత్వం ఉంది’ అని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఇండియాతో ఆస్ట్రేలియా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పాయి.

News December 16, 2025

IPL.. పతిరణకు రూ.18 కోట్లు

image

శ్రీలంక యంగ్ బౌలర్ మతీశా పతిరణను రూ.18 కోట్లకు KKR కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ఇతడి కోసం ఢిల్లీ, లక్నో పోటీ పడ్డాయి. డెత్ ఓవర్లలో యార్కర్లు వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించడం పతిరణ స్పెషల్. ఇతడు గతంలో చెన్నై తరఫున ఆడారు. సౌతాఫ్రికా బౌలర్ నోర్జ్‌ను లక్నో రూ.2 కోట్లకు దక్కించుకుంది. అటు భారత స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు.

News December 16, 2025

ఏపీపీ పోస్టులకు ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?

image

AP: 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబర్ 19 నుంచి 22 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్ మీనా తెలిపారు.