News July 19, 2024

ఒలింపిక్స్ కోసం వేలు తొలగించుకున్నాడు

image

పారిస్ ఒలింపిక్స్‌లో దేశం కోసం ఆడాలనే కృత నిశ్చయంతో ఆస్ట్రేలియా హాకీ ప్లేయర్ మాట్ డాసన్ వేలు త్యాగం చేశారు. ఇటీవల అతడి కుడి చేతి ఉంగరపు వేలు విరిగింది. ఎముక అతికేందుకు సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో డాక్టర్ల సాయంతో ఆ వేలు పైభాగాన్ని తొలగించుకున్నారు. అతడి పట్టుదలపై కోచ్, తోటి ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడు గత టోక్యో ఒలింపిక్స్‌లో తన దేశానికి రజత పతకం సాధించడం గమనార్హం.

Similar News

News January 24, 2025

రాజకీయాలకు గుడ్ బై: విజయసాయిరెడ్డి

image

AP: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ నేత, వైఎస్ జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని తెలిపారు. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. పవన్‌తో చిరకాల స్నేహం ఉందని, భవిష్యత్తు వ్యవసాయం అంటూ రాసుకొచ్చారు.

News January 24, 2025

BSNL కస్టమర్లకు గుడ్‌న్యూస్

image

ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం BSNL కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో దేశంలో 65వేలు+ 4G టవర్లను ఏర్పాటు చేసింది. అందులో 2వేల కంటే ఎక్కువ టవర్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నట్లు సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌లో 675, రంగారెడ్డిలో 100, మెదక్‌లో 158, నల్గొండలో 202, మహబూబ్‌నగర్‌లో 151, ఆదిలాబాద్‌లో 141, నిజామాబాద్‌లో 113, కరీంనగర్‌లో 98, వరంగల్‌లో 231, ఖమ్మంలో 219 టవర్స్ ఏర్పాటు చేశామంది.

News January 24, 2025

650 పోస్టులు.. ఎంపికైన వారి లిస్టు విడుదల

image

TG: అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ లిస్టును TGPSC విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ప్రొవిజినల్ లిస్టును <>వెబ్‌సైట్‌లో<<>> అందుబాటులో ఉంచింది. మొత్తం 650 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది.