News June 30, 2024

ఎక్కడ పోయిందో.. అక్కడే వెతుక్కున్నాడు

image

ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కి ఈ వరల్డ్ కప్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే 2007 ODI WCలో ఇదే వెస్టిండీస్ గడ్డపై ద్రవిడ్ కెప్టెన్సీలోని భారత్ గ్రూప్ స్టేజీలోనే అవమానకర రీతిలో నిష్క్రమించింది. దీంతో రాహుల్ కొన్నాళ్లకే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పారు. అయితే ఇన్నాళ్లకు మళ్లీ అదే గడ్డపై కోచ్‌గా WC సాధించారు. అందుకే కప్ తన చేతిలోకి రాగానే ఎన్నడూ ఎమోషన్స్ కనిపించని ద్రవిడ్ మొహంలో తీవ్ర భావోద్వేగం కనిపించింది.

Similar News

News October 21, 2025

మనందరి తొలి ఆర్ట్ టీచర్ ఈయనే.. ఏమంటారు?

image

మనలో చాలా మంది సృజనాత్మకతను తొలిసారి బయటకు తీసింది POGO ఛానల్‌లో వచ్చిన ‘M.A.D. with Rob’ షోనే. ఇది 90S కిడ్స్‌కి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. హోస్ట్ రాబ్ మనందరి తొలి ఆర్ట్ టీచర్. ఆయన వేస్ట్ నుంచి బెస్ట్ క్రాఫ్ట్స్‌ ఎలా చేయాలో చక్కగా వివరించేవారు. దాన్ని ఫాలో అయి మనమూ రూపొందిస్తే పేరెంట్స్ సంతోషించేవారు. అందుకే ఈ షో చూసేందుకు వారు ప్రోత్సహించేవారు. దీనిని మరోసారి ప్రసారం చేయాలనే డిమాండ్ నెలకొంది.

News October 21, 2025

ఒంబ్రొఫోబియా: వర్షం అంటే వణుకే!

image

కొందరికి వర్షం అంటే భయం. దాన్ని ఒంబ్రొఫోబియా అంటారు. పిల్లలు, టీనేజర్లకు ఈ ఫోబియా ఎక్కువగా ఉంటుంది. వీరు పదే పదే వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకుంటారు. వర్షం పడితే ఎంత ఎమర్జెన్సీ ఉన్నా ఇంటినుంచి బయటకు వెళ్లరు. వర్షం ఆగినా కొన్ని గంటల పాటు ఇంటికే పరిమితమవుతారు. గుండె దడ, వణుకు, భయం, ఛాతినొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ ఫోబియాకు ప్రత్యేక చికిత్స అంటూ ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారు.

News October 21, 2025

అతి భారీ వర్ష సూచన.. స్కూళ్లకు సెలవు

image

AP: అతి భారీ వర్ష సూచన నేపథ్యంలో నెల్లూరు జిల్లా అధికారులు రేపు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రేపు ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని APSDMA వెల్లడించింది. ఈ నేపథ్యంలో వర్షాలు పడే అవకాశమున్న మిగతా జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని పేరెంట్స్, స్టూడెంట్స్ కోరుతున్నారు.