News June 30, 2024
ఎక్కడ పోయిందో.. అక్కడే వెతుక్కున్నాడు
ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కి ఈ వరల్డ్ కప్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే 2007 ODI WCలో ఇదే వెస్టిండీస్ గడ్డపై ద్రవిడ్ కెప్టెన్సీలోని భారత్ గ్రూప్ స్టేజీలోనే అవమానకర రీతిలో నిష్క్రమించింది. దీంతో రాహుల్ కొన్నాళ్లకే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పారు. అయితే ఇన్నాళ్లకు మళ్లీ అదే గడ్డపై కోచ్‌గా WC సాధించారు. అందుకే కప్ తన చేతిలోకి రాగానే ఎన్నడూ ఎమోషన్స్ కనిపించని ద్రవిడ్ మొహంలో తీవ్ర భావోద్వేగం కనిపించింది.
Similar News
News October 8, 2024
BIG BREAKING: బీజేపీ సంచలన విజయం
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హరియాణాలో బీజేపీ సంచలన విజయం సాధించింది. వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకుని హ్యాట్రిక్ కొట్టింది. తొలుత కాంగ్రెస్ భారీ ఆధిక్యంలో దూసుకెళ్లినా క్రమంగా కమలం రేసులోకి వచ్చింది. ఇక అప్పటినుంచి వరుసగా సీట్లు గెలుస్తూ మ్యాజిక్ ఫిగర్ (46) దాటింది. EC లెక్కల ప్రకారం 90 సీట్లకు గాను BJP 46, కాంగ్రెస్ 35 చోట్ల గెలిచాయి. చెరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
News October 8, 2024
బీజేపీని గెలిపించిన 200 రోజుల ముఖ్యమంత్రి
ఎన్నికలకు 200 రోజుల ముందు హరియాణా CMగా బాధ్యతలు చేపట్టిన నాయబ్ సింగ్ సైనీ BJPని అనూహ్యంగా విజయతీరాలకు చేర్చారు. డమ్మీ CM అని ఎన్ని విమర్శలు వచ్చినా BJP ఎన్నికల ప్రచారం మొత్తం ఆయన చుట్టూనే తిరిగింది. ఫలితాలపై ముందుగానే బాధ్యత వహించిన సైనీ ప్రభుత్వ వ్యతిరేకతలోనూ పార్టీని ముందుండి నడిపారు. అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయానికి కారణమయ్యారు.
News October 8, 2024
జమ్మూ ప్రజలు మాతోనే ఉన్నారు: కిషన్ రెడ్డి
జమ్మూ ప్రాంతంలో బీజేపీ విజయం చరిత్రాత్మకం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతంలో కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామని తెలిపారు. జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లలో బీజేపీ 29 స్థానాలు గెలుచుకుందని, కాంగ్రెస్ కేవలం ఒక్క సీటు మాత్రమే సాధించిందని పేర్కొన్నారు. జమ్మూ ప్రజలు తమతోనే ఉన్నారని మరోసారి నిరూపితమైందని వివరించారు. కాగా, J&Kలో కాంగ్రెస్, ఎన్సీ కూటమి గెలవగా, జమ్మూ ప్రాంతంలో బీజేపీ సత్తా చాటింది.