News December 1, 2024

యూట్యూబ్‌ వీడియోలతో చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం పొందాడు!

image

కుటుంబ కష్టాలను తీర్చేందుకు చదువు ఒక్కటే మార్గమని భావించి, రోజుకు 18-20 గంటలు చదివి ప్రభుత్వ ఉద్యోగం పొందిన ఆదర్శ్‌ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన తండ్రి విజయ్ సావ్ బిహార్‌లోని శివగంజ్‌లో కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. యూట్యూబ్‌లో క్లాసులు వింటూ నేర్చుకొని తొలి ప్రయత్నంలోనే BPSC సివిల్ సర్వీస్ జుడీషియల్ పరీక్షలో ఉత్తీర్ణులై న్యాయమూర్తి ఉద్యోగం పొందారు.

Similar News

News February 11, 2026

చికెన్‌లో ఈ భాగాలు తినకండి

image

కోళ్ల లంగ్స్‌లోని పరాన్నజీవులు ఎక్కువ వేడిని తట్టుకోగలవు. మనం బాగా ఉడికించినా కొన్ని నశించకపోవచ్చు. పెస్టిసైడ్స్ తింటే కోడి తలలో చిన్న కణితులు ఏర్పడతాయి. కాబట్టి తల జోలికి వెళ్లకపోవడం బెటర్. కాళ్ల వేళ్లు, ప్రేగులు, జీర్ణాశయంలో బాక్టీరియా పేరుకుంటుంది. సాధారణంగా శుభ్రం చేస్తే అవి పోవు. స్కిన్ పూర్తిగా కొలెస్ట్రాల్ కావడంతో ఊబకాయులు, హార్ట్ సమస్యలు ఉన్నవారు తినకండి.

News February 11, 2026

జగ్గారెడ్డిపై ఎన్నికల సంఘం ఆగ్రహం

image

TG: సంగారెడ్డిలో జగ్గారెడ్డి <<19110877>>వ్యవహారంపై<<>> రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయన కామెంట్స్ ఓటర్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంది. ఆయనపై కేసు నమోదు చేసి, రిపోర్ట్ ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. కాగా సీఐ కాంగ్రెస్ అభ్యర్థి చొక్కా పట్టుకున్నారంటూ పోలీసులపై జగ్గారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ ఆపుతానంటూ పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.

News February 11, 2026

గోడ‌పై క్యాలెండర్ మారుతున్నా జాబ్ క్యాలెండర్ రాదు: షర్మిల

image

AP: గవర్నర్ బడ్జెట్ ప్రసంగమంతా అవాస్తవాలు, కల్పితాలేనని APCC చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ‘కూటమి సూపర్ సిక్స్ హామీలు సూపర్ ప్లాప్ అయ్యాయి. మెగా డీఎస్సీని దగా చేశారు. గోడపై క్యాలెండర్లు మారుతున్నా జాబ్ క్యాలెండర్ మాత్రం రావడం లేదు. అన్నదాత సుఖీభవ కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారు. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అంతా ఫేక్’ అని ధ్వజమెత్తారు.