News October 9, 2024
ఆస్ట్రేలియా సిరీస్ ప్రదర్శనలో అతడే టాప్లో ఉంటాడు: లారా

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్లో టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అద్భుత ప్రదర్శన చేస్తారని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అంచనా వేశారు. ‘ఈసారి BGTలో అందరికంటే యశస్వీ బాగా ఆడతారు. కరీబియన్ దీవుల్లో ఆడినప్పుడు తన ఆటతీరు చూశాను. ఏ పరిస్థితుల్లోనైనా మంచి క్రికెట్ ఆడగల ప్లేయర్. టీమ్ ఇండియానే సిరీస్ గెలుచుకుంటుంది’ అని లారా జోస్యం చెప్పారు.
Similar News
News November 28, 2025
కామారెడ్డి: జాగృతి చీఫ్ కవిత నేటి షెడ్యూల్

KMR జిల్లాలో శుక్రవారం తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. హోటల్ అమృత గ్రాండ్లో ఉదయం 10 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడే 11 గంటలకు విద్యావంతులు, మేధావులతో సమావేశం నిర్వహిస్తారు. 12 గంటలకు కామారెడ్డి పట్టణ వరద భాదిత కాలనీ సందర్శిస్తారు. 2:30 గంటలకు జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శిస్తారు. 4:30 గంటలకు భిక్కనూర్ సిద్ధి రామేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు.
News November 28, 2025
సికిల్సెల్, తలసేమియా రోగుల కోసం ప్రత్యేక శిబిరాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సికిల్సెల్, తలసేమియా దీర్ఘకాలిక రక్త వ్యాధులతో బాధపడుతున్న రోగుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరాలను ఈ నెల 29న (శనివారం) ఉదయం 8 గంటలకు అశ్వారావుపేటలో, మధ్యాహ్నం 12:30 గంటలకు నారాయణపురంలోని రైతు వేదికల్లో నిర్వహించనున్నారు.. రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News November 28, 2025
నేడు కామారెడ్డికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న PDSU 23వ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరుకానున్నారు. PDSU జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లాలోని పీడీఎస్యూ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై, మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.


