News October 9, 2024
ఆస్ట్రేలియా సిరీస్ ప్రదర్శనలో అతడే టాప్‌లో ఉంటాడు: లారా
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అద్భుత ప్రదర్శన చేస్తారని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అంచనా వేశారు. ‘ఈసారి BGTలో అందరికంటే యశస్వీ బాగా ఆడతారు. కరీబియన్ దీవుల్లో ఆడినప్పుడు తన ఆటతీరు చూశాను. ఏ పరిస్థితుల్లోనైనా మంచి క్రికెట్ ఆడగల ప్లేయర్. టీమ్ ఇండియానే సిరీస్ గెలుచుకుంటుంది’ అని లారా జోస్యం చెప్పారు.
Similar News
News November 12, 2024
శాంసన్‌పై ప్రశ్నకు మనసులు గెలిచేలా గౌతీ జవాబు
సంజూ శాంసన్ వరుస సెంచరీల వెనక తన ఘనతేమీ లేదని టీమ్ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. అదంతా అతడి ప్రతిభేనని ప్రశంసించారు. ‘సంజూ ఫామ్ కోసం నేను చేసిందేమీ లేదు. అతడు సమర్థుడు. మనం చేయాల్సిందల్లా అతడిని సరైన స్థానంలో క్రీజులోకి పంపించి ఎంకరేజ్ చేయడమే. సంజూ చాలా శ్రమిస్తారు. ఇది అంతం కాదు ఆరంభం. భారత్ కోసం అతడిలాగే ఆడాలని కోరుకుంటున్నా. ప్రెజర్లోనూ యువ ఆటగాళ్లు రాణించడం శుభసూచకం’ అని పేర్కొన్నారు.
News November 12, 2024
వందేభారత్ ఫుడ్.. పనీర్ కర్రీ చూడండి!
వందేభారత్ రైళ్లలో ఫుడ్ దారుణంగా ఉంటోందని ప్రయాణికులు వాపోతున్నారు. రూ.220 తీసుకుని నాసిరకం ఆహారం పెడుతున్నారని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పనీర్ కర్రీ నీళ్లలాగా ఉందని, దీన్ని ఎలా తినాలని ప్రశ్నించారు. మెనూ ఛాయిస్ కూడా ఉండట్లేదని వాపోయారు. రైళ్లలో కంటే ఇంటి నుంచే ఫుడ్ తీసుకెళ్లడం బెటర్ అని పలువురు సూచిస్తున్నారు.
News November 12, 2024
ఒక్కరోజే రూ.1,470 తగ్గిన బంగారం ధర
ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి రూ.1,470 తగ్గి రూ.77,290కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,350 తగ్గి రూ.70,850 పలుకుతోంది. అటు కేజీ వెండి రేటు రూ.2,000 తగ్గి రూ.లక్షకు చేరింది.