News May 15, 2024

1998లో మిస్సయ్యాడు.. పక్కింట్లోనే దొరికాడు

image

అల్జీరియాలో ఓమర్ బి(45) అనే వ్యక్తి 1998లో తప్పిపోయి.. 26ఏళ్ల తర్వాత పక్కింట్లో ప్రత్యక్షమయ్యారు. 1998 అల్జీరియన్ అంతర్యుద్ధంలో ఒమర్‌ని ఎవరో కిడ్నాప్/హతమార్చారని కుటుంబం భావించింది. అయితే అతడిని ఇన్నాళ్లు పక్కింటి వ్యక్తే(61) బంధించినట్లు తేలింది. విదేశాలకు పారిపోవాలని చూసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బందీగా ఉండటంతో సహాయం పొందలేకపోయానని ఓమర్ చెప్పారు. బంధించడానికి కారణాలు చెప్పలేదు.

Similar News

News March 12, 2026

సిలిండర్లు నిల్వ ఉంచుకోవద్దు.. కేంద్రం సూచన

image

దేశంలో గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందొద్దని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ వెల్లడించింది. LPG ఉత్పత్తి పెంపు, సరఫరాలో ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంది. 2.5 రోజుల్లోనే సిలిండర్లు డెలివరీ చేస్తున్నామని తెలిపింది. ప్రజలు ఆందోళన చెంది హడావుడిగా బుకింగ్స్ చేయడం లేదా సిలిండర్లు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. అవసరమైన సమయంలో ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.

News March 12, 2026

చిప్ తయారీ కోసం కేంద్రం ₹లక్ష కోట్ల ఫండ్?

image

ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో వాడే చిప్‌ల తయారీని ప్రోత్సహించేందుకు ₹లక్ష కోట్లను కేటాయించాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫండ్‌తో చిప్ డిజైన్ ప్రాజెక్టులు, తయారీ పరికరాలు, సరఫరా వ్యవస్థ అభివృద్ధికి సబ్సిడీలను కల్పించనుంది. చిప్ తయారీ కోసం ₹4లక్షల కోట్లను కేటాయించిన US తరహాలోనే ఈ పాలసీతో గ్లోబల్ కంపెనీలను ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. మరో 2 లేదా 3 నెలల్లో ఇది లాంచ్ కావొచ్చని సమాచారం.

News March 12, 2026

The Hundred: పాక్ ప్లేయర్‌ను సన్‌రైజర్స్ కొనడంపై విమర్శలు!

image

ఇంగ్లండ్‌ టోర్నీ The Hundred వేలంలో పాక్ ఆటగాడు అబ్రార్ అహ్మద్‌ను సన్ రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ₹2.34 కోట్లకు అతడిని దక్కించుకోవడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి ఇది సిగ్గు చేటని ఫైరవుతున్నారు. ఇండియాను, ఆర్మీని ఎగతాళి చేసే వ్యక్తిని తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. IPL అనుబంధ ఫ్రాంచైజీలు పాక్ ప్లేయర్లను అవైడ్ చేస్తాయని ఇటీవల వార్తలొచ్చాయి.