News September 30, 2024

మాతృభాషను మర్చిపోయినవాడు మనిషి కాదు: వెంకయ్య

image

AP: తెలుగు వచ్చిన వాళ్ల ముందు ఇంగ్లిష్‌లో ఎందుకు మాట్లాడతారో అర్థం కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు. ఇంగ్లిష్‌లో మాట్లాడే నాయకులు గొప్పవాళ్లు కాదని చెప్పారు. ఛత్రపతి, లక్ష్మీబాయి, కొమరం భీం లాంటి వాళ్లు మాతృభాష మాట్లాడే గొప్పవాళ్లు అయ్యారని తెలిపారు. ANUలో నిర్వహించిన తత్వవేత్త సచ్చిదానందమూర్తి శతజయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. మాతృభాషను మర్చిపోయినవాడు మనిషి కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Similar News

News September 30, 2024

WTCలో చరిత్ర సృష్టించిన అశ్విన్

image

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో భారత బౌలర్ అశ్విన్ చరిత్ర సృష్టించారు. వరుసగా 3 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్స్(WTC)లో 50+ వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచారు. ఇతను 2019-21లో 71, 2021-23లో 61, 2023-25లో 50* వికెట్లు తీశారు. నాథన్ లియాన్, పాట్ కమిన్స్, టిమ్ సౌథీ రెండు సీజన్లలో 50+ వికెట్లు పడగొట్టారు. కాగా ఓవరాల్‌గా WTCలో 187 వికెట్లతో లియాన్ టాప్‌లో ఉండగా, అశ్విన్(182) రెండో స్థానంలో ఉన్నారు.

News September 30, 2024

లైంగిక వేధింపుల కేసులో నటుడికి ముందస్తు బెయిల్

image

లైంగిక వేధింపుల కేసులో మాలీవుడ్ న‌టుడు సిద్ధిక్‌కి సుప్రీంకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల‌ విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని ఆదేశించింది. ఆయ‌న‌పై వేధింపుల ఆరోప‌ణ‌లు రావ‌డంతో కేరళ పోలీసులు విచార‌ణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సిద్ధిక్ దాఖ‌లు చేసిన‌ ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ను కేర‌ళ హైకోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంను ఆశ్రయించగా తాజాగా ఆయ‌న‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగింది.

News September 30, 2024

తిరుమల లడ్డూ వ్యవహారంపై విచారణ వాయిదా

image

AP: తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ వచ్చే గురువారానికి వాయిదా పడింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌తో దర్యాప్తు కొనసాగించాలా? లేదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణపై అభిప్రాయం చెప్పాలని కేంద్రాన్ని అడిగింది.