News September 30, 2024
మాతృభాషను మర్చిపోయినవాడు మనిషి కాదు: వెంకయ్య
AP: తెలుగు వచ్చిన వాళ్ల ముందు ఇంగ్లిష్‌లో ఎందుకు మాట్లాడతారో అర్థం కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు. ఇంగ్లిష్‌లో మాట్లాడే నాయకులు గొప్పవాళ్లు కాదని చెప్పారు. ఛత్రపతి, లక్ష్మీబాయి, కొమరం భీం లాంటి వాళ్లు మాతృభాష మాట్లాడే గొప్పవాళ్లు అయ్యారని తెలిపారు. ANUలో నిర్వహించిన తత్వవేత్త సచ్చిదానందమూర్తి శతజయంతి ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. మాతృభాషను మర్చిపోయినవాడు మనిషి కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Similar News
News October 6, 2024
జనసంద్రమైన మెరీనా బీచ్(PHOTOS)
చెన్నైలో ఎయిర్‌షోకు ప్రజలు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో లక్షలాది మంది ఎయిర్‌షోను చూసేందుకు తరలివచ్చారు. దీంతో మెరీనా బీచ్ అంతా జనసంద్రమైంది. బీచ్‌కు వచ్చే రోడ్లు, మెట్రో రైళ్లు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయాయి. ఈక్రమంలోనే మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు.
News October 6, 2024
పాక్‌పై మరోసారి ఆధిపత్యం చాటిన భారత్
భారత మహిళల క్రికెట్ జట్టు పాకిస్థాన్‌పై మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టును ఓడించింది. ఇరు జట్లు ఇప్పటివరకు మెగా టోర్నీల్లో 8 సార్లు తలపడి భారత్ 6 సార్లు గెలవగా, పాక్ రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఇక ఓవరాల్‌గా దాయాదుల మధ్య 16 టీ20 మ్యాచులు జరగ్గా 13 భారత్, 3 పాక్ గెలిచింది.
News October 6, 2024
చెన్నైలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
చెన్నై మెరీనా బీచ్‌లో ఎయిర్‌షో సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. ఎయిర్‌షో చూసేందుకు లక్షలాది మంది తరలిరావడంతో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరింత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు ఏపీకి చెందిన వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. సుమారు 100 మంది స్థానిక ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.