News August 9, 2024

నన్ను దుబాయ్‌లో అమ్మేస్తాడు అన్నారు: తాప్సీ

image

హీరోయిన్ తాప్సీ తన భర్త మథియాస్ బో గురించి ఓ టీవీ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మథియాస్‌తో నాకు పదేళ్ల నుంచే పరిచయం ఉంది. ఈ దశాబ్దకాలంలో మమ్మల్ని ఎవరూ విడదీయలేకపోయారు. ఫస్ట్ డేట్ కోసం మేం ఓసారి దుబాయ్ వెళ్లాం. కానీ మథియాస్ నన్ను దుబాయ్‌ షేక్‌లకు అమ్మేస్తాడేమో జాగ్రత్తగా ఉండాలంటూ వెళ్లేముందు నా ఫ్రెండ్స్ ఆటపట్టించారు’ అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా మథియాస్ డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్.

Similar News

News September 8, 2024

గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ

image

APలో భారీ వర్షాలు, విజయవాడలో బుడమేరుతో సంభవించిన వరద పరిస్థితులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి CM చంద్రబాబు వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు రేయింబవళ్లు అధికార యంత్రాంగం పనిచేసిందని, ప్రభుత్వం చేపట్టిన సహాయ, పునరావాస కార్యక్రమాలను తెలియజేశారు. వరద వల్ల భారీ నష్టం జరిగిందని గవర్నర్‌కు చెప్పారు. అటు త్వరలోనే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

News September 8, 2024

మరో 3 జిల్లాల్లో రేపు సెలవు

image

APలోని ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తాజాగా 3 జిల్లాలకు సోమవారం సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లోని స్కూళ్లకు రేపు సెలవు ఇస్తూ కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. వర్షాలు, వరదల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా ఇప్పటికే విజయనగరం జిల్లాలో సెలవు <<14051952>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే.

News September 8, 2024

ఫోన్ ఎక్కువగా వాడేవారిలో హైపర్ టెన్షన్!

image

ఫోన్‌ను అతిగా వాడటం వలన అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని యూకే పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్-డిజిటల్ హెల్త్’లో పబ్లిష్ అయిన ఆ నివేదిక ప్రకారం.. రోజుకు 6 గంటలకంటే ఎక్కువగా ఫోన్ వాడే వారిలో హైపర్‌టెన్షన్ వచ్చే ప్రమాదం 25శాతానికి పైగా ఉంటుంది. దీని కారణంగా గుండె, కిడ్నీ జబ్బులు వచ్చే రిస్క్ కూడా తీవ్రంగా ఉంటోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.