News December 3, 2024
అడిలైడ్ చేరుకున్న హెడ్ కోచ్ గంభీర్

టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ తిరిగి జట్టులో చేరారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన ఆస్ట్రేలియా నుంచి నవంబర్ 26న ఇండియా తిరిగొచ్చారు. BGT సిరీస్లో భాగంగా 2వ టెస్టు కోసం నిన్న జట్టు అడిలైడ్ చేరుకోగా, గంభీర్ ఇవాళ జట్టులో చేరారు. ఈ వారం రోజులు అభిషేక్ నాయర్, డస్కాటే, మోర్నీ మోర్కెల్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తొలి టెస్ట్కు దూరమైన రోహిత్, గిల్ డిసెంబర్ 6న ప్రారంభం కానున్న 2వ టెస్టులో ఆడనున్నారు.
Similar News
News January 30, 2026
మామునూరు విమానాశ్రయం.. కేంద్రానికి 300 ఎకరాలు అప్పగింత

TG: WGL మామునూరు విమానాశ్రయం కోసం సేకరించిన 300 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. బేగంపేట్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి Dy.CM భట్టి విక్రమార్క డాక్యుమెంట్లను అందజేశారు. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని రామ్మోహన్ స్పష్టం చేశారు. పనులు ప్రారంభమైన నాటి నుంచి 2.5ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
News January 30, 2026
వరాహ స్వామి, వారాహి దేవి.. ఇద్దరూ ఒకరేనా?

ఇద్దరూ ఒకరు కాదు. కానీ ఒకే తత్వానికి చెందినవారు. వరాహ స్వామి దశావతార రూపం. వారాహి దేవి మాత్రం వరాహమూర్తి నుంచి ఉద్భవించిన ఆయన అంశ. సప్తమాతృకలలో ఒకరైన వారాహి దేవి, వరాహ స్వామి ముఖాన్ని పోలి ఉండి, రాక్షస సంహారంలో శక్తిగా తోడ్పడింది. వరాహ స్వామి రక్షకుడు అయితే, వారాహి దేవి ఆ స్వామి కార్యనిర్వాహక శక్తి. అయితే వరాహ అవతారానికి పూర్వమే, వారాహి దేవి ఉనికి ఉందని ఇంకొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.
News January 30, 2026
మున్సి’పోల్స్’.. నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

TG: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ఈరోజు సా.5 గంటలకు ముగియనుంది. రెండో రోజు 7,980 మంది అభ్యర్థుల నుంచి 8,326 నామినేషన్లు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. ఇందులో కాంగ్రెస్ నుంచి 3,379, BRS 2,506, BJP 1,709, BSP 142, CPI(M) 88, MIM 166, AAP 17, TDP నుంచి 10 ఉన్నట్లు తెలిపింది. తొలి రోజు వచ్చిన వాటితో కలిపి మొత్తం నామినేషన్ల సంఖ్య 9,276కి చేరింది. చివరి రోజు మరింత పెరిగే ఛాన్సుంది.


