News December 3, 2024

అడిలైడ్ చేరుకున్న హెడ్ కోచ్ గంభీర్

image

టీమ్‌ఇండియా హెడ్ కోచ్ గంభీర్ తిరిగి జట్టులో చేరారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఆయన ఆస్ట్రేలియా నుంచి నవంబర్ 26న ఇండియా తిరిగొచ్చారు. BGT సిరీస్‌లో భాగంగా 2వ టెస్టు కోసం నిన్న జట్టు అడిలైడ్ చేరుకోగా, గంభీర్ ఇవాళ జట్టులో చేరారు. ఈ వారం రోజులు అభిషేక్ నాయర్, డస్కాటే, మోర్నీ మోర్కెల్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. తొలి టెస్ట్‌కు దూరమైన రోహిత్, గిల్ డిసెంబర్ 6న ప్రారంభం కానున్న 2వ టెస్టులో ఆడనున్నారు.

Similar News

News January 17, 2025

ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్

image

AP: రాష్ట్రంలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. రేపు కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యాక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 12 నెలలకు 12 థీమ్‌లతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు.

News January 17, 2025

రీఛార్జ్ చేసుకునే వారికి GOOD NEWS

image

దేశంలోని 15 కోట్ల 2G యూజర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. వాయిస్ కాల్స్, SMS వంటి బేసిక్ సర్వీసులు మాత్రమే అవసరమయ్యే వీరి కోసం రూ.10తో రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. దీంతో ఇంటర్నెట్ అవసరం లేని వారు భారీ మొత్తంతో రీఛార్జ్ చేసుకునే తిప్పలు తప్పుతాయి. అలాగే స్పెషల్ టారిఫ్ వోచర్ (STV)ల వ్యాలిడిటీ 90 రోజులు ఉండగా తాజాగా 365 రోజులకు పెంచింది.

News January 17, 2025

3.5 కోట్ల పని దినాలు కల్పించండి.. కేంద్రానికి లేఖ

image

AP: ఉపాధి హామీ పని దినాలు పూర్తి కావొస్తుండటంతో అదనంగా కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి కేంద్రం 21.50 కోట్ల పనిదినాలు కేటాయించగా 20.45 కోట్ల పని దినాలు పూర్తి చేశారు. దీంతో మరో 3.5 కోట్ల పనిదినాలు కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.