News March 4, 2025
ట్రెండింగ్‌లో హెడ్, వరుణ్!

భారత జట్టుకు హెడేక్ తెప్పించిన ఆసీస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌ను స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఔట్ చేసి ఔరా అనిపించారు. హెడ్ సిక్సులు, ఫోర్లతో టెన్షన్ పెట్టించడంతో సోషల్ మీడియాలో అతని పేరు మారుమోగింది. అతణ్ని ఔట్ చేయడంతో నెటిజన్లు ‘చక్రవర్తి’ పేరునూ ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం Xలో ‘Travis Head’, ‘Varun’ హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండవుతుండగా, అద్భుతమైన క్యాచ్ పట్టిన గిల్‌పైనా ప్రశంసలొస్తున్నాయి.
Similar News
News February 13, 2026
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా..

TG: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదట బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను ఒకేసారి ఓపెన్ చేస్తారు. 25 బ్యాలెట్ పత్రాల చొప్పున బండిల్ చేసి వెయ్యి ఓట్ల(ఒక రౌండ్)ను ఒక కట్టగా ఉంచుతారు. ఓట్లను బట్టి రౌండ్ల వారీగా ప్రతీ బ్యాలెట్ పేపర్‌ను ఏజెంట్‌కు చూపిస్తూ లెక్కింపు సాగుతుంది. చివరకు ఫలితాలు ప్రకటిస్తారు.
* ఫలితాలు వేగంగా తెలుసుకునేందుకు Way2Newsను ఫాలో అవ్వండి.
News February 13, 2026
శ్రీశైలం వెళ్లే వాహనాలకు టోల్ మినహాయింపు

శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 16 వరకు శ్రీశైలం వెళ్లే వాహనాలకు టోల్ ఫీజు మినహాయింపు ఇస్తున్నట్లు నంద్యాల కలెక్టర్ రాజకుమారి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా 24 గంటలు రాకపోకలకు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 2.59 లక్షలకు పైగా భక్తులు దర్శనాలు చేసుకున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సుమారు 3వేల బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
News February 13, 2026
ఎద్దు తన్నునని గుర్రంచాటున దాగినట్లు

ఎవరైనా ఎద్దు పొడుస్తుందని లేదా తన్నుతుందని భయపడి, దాని నుంచి రక్షణ కోసం వెళ్లి గుర్రం వెనుక దాకుంటే అది మరింత ప్రమాదకరం. ఎందుకంటే ఎద్దు కంటే గుర్రం మరింత వేగంగా, బలంగా తన్నుతుంది. అంటే ఎవరైనా వ్యక్తి ఒక చిన్న కష్టం నుంచి బయటపడాలని చూస్తూ, తనకు తెలియకుండానే అంతకంటే భయంకరమైన చిక్కుల్లో పడినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.


