News September 13, 2024

పవర్‌ప్లేలో ‘హెడ్’ మాస్టరే..!

image

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ టీ20ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. ఈ ఏడాది పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా హెడ్ కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆయన 192.32 స్ట్రైక్ రేట్‌తో 1,027 పరుగులు బాదారు. అతడి తర్వాత ఫిల్ సాల్ట్ (827), డుప్లెసిస్ (807), అలెక్స్ హేల్స్ (792), జేమ్స్ విన్స్ (703) ఉన్నారు. ఓవరాల్‌గా ఈ ఏడాది హెడ్ 181.36 స్ట్రైక్ రేట్‌తో 1,411 రన్స్ సాధించారు.

Similar News

News October 11, 2024

డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌ట‌న‌పై స్పందించిన కేజ్రీవాల్‌

image

అధికారంలోకొస్తే ఏడాదిలోపు విద్యుత్ ఛార్జీల‌ను స‌గానికి త‌గ్గిస్తాన‌న్న డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌ట‌న‌పై EX CM కేజ్రీవాల్ స్పందించారు. ‘ఉచితాలు అమెరికా వ‌ర‌కు చేరుకున్నాయి’ అని ట్వీట్ చేశారు. అయితే, NDA పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ అమ‌లు చేస్తే BJP తరఫున ప్ర‌చారం చేస్తాన‌ని కేజ్రీవాల్ ఇటీవల స‌వాల్ విసిరారు. తాజాగా ట్రంప్ ప్రకటనపై స్పందించడం వెనుక ఆయన BJPని టార్గెట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది.

News October 11, 2024

జపాన్‌ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం

image

2024 ఏడాదికి గానూ నోబెల్ శాంతి బ‌హుమ‌తి జపనీస్ సంస్థ నిహాన్ హిడాంక్యోను వ‌రించింది. అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసినట్టు కమిటీ ప్రకటించింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 111 మంది స‌భ్యులు, 31 సంస్థ‌ల‌ను నోబెల్ శాంతి బ‌హుమ‌తి వ‌రించింది. ఈ ఏడాది పుర‌స్కారానికి 286 నామినేష‌న్ల‌ను ప‌రిశీలించిన క‌మిటీ నిహాన్ హిడాంక్యోను పుర‌స్కారానికి ఎంపిక చేసింది.

News October 11, 2024

ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై శ్రుతి హాసన్ ఆగ్రహం

image

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం ఆలస్యం కావడం పట్ల నటి శ్రుతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు. ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ‘నేను సాధారణంగా ఫిర్యాదులు చేయను. ఇండిగో.. మీరు సేవల్లో ఎప్పటికప్పుడు దిగజారుతున్నారు. నాలుగు గంటలుగా ఎయిర్‌పోర్టులోనే మగ్గుతున్నాం. దీనిపై మీ నుంచి కనీస సమాచారం లేదు. మీ పాసింజర్ల కోసం మెరుగైన మార్గాల్ని అన్వేషించండి. ప్లీజ్’ అని కోరారు.