News March 22, 2024
HEADLINES
* లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్
* కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన ప్రతిపక్షాలు
* హోలీ లోపే అభ్యర్థుల ప్రకటన: సీఎం రేవంత్
* 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల
* 9 మందితో బీజేపీ మూడో జాబితా విడుదల
* విశాఖ పోర్టులో 25వేల కేజీల డ్రగ్స్ పట్టివేత
* చెన్నై కెప్టెన్‌గా తప్పుకున్న ధోనీ
* రేపటి నుంచి IPL ప్రారంభం
Similar News
News September 17, 2024
మహేశ్-రాజమౌళి మూవీ.. షూటింగ్ ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి SSMB29 పేరుతో ఉన్న స్క్రిప్ట్ పేపర్లతో కూడిన పోస్ట్ వైరలవుతోంది. ఇందులో స్టోరీ-విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రఫీ-P.S. వినోద్ అని రాసి ఉంది. కాగా దసరాకు షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News September 17, 2024
‘మ్యాడ్’ సీక్వెల్‌పై రేపే అప్డేట్
నార్నె నితిన్ హీరోగా సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’కు సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్‌ను రేపు ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ‘మ్యాడ్ మ్యాక్స్‌తో బాయ్స్ మళ్లీ రాబోతున్నారు’ అని పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా ‘మ్యాడ్’ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
News September 17, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.