News November 30, 2024

బ్యాంకులు, బీమా కంపెనీల ద్వారా ఉద్యోగులకు ఆరోగ్య బీమా?

image

APలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఇతర వర్గాలకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా వైద్యం అందుతోంది. వీరికి ఆరోగ్య బీమా పథకాన్ని(EHS) జాతీయ బ్యాంకులు, బీమా కంపెనీల ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీమా కోసం ప్రస్తుతం ఏడాదికి ఒక్కో ఉద్యోగి దాదాపు ₹7వేలు చెల్లిస్తున్నారు. అయితే రెండు జాతీయ బ్యాంకుల ప్రీమియం ₹2,500 మాత్రమే ఉంది. దీంతో ఈ విధానం అమలు చేయడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.

Similar News

News July 8, 2025

అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదిక సమర్పణ

image

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB).. విమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించింది. బ్లాక్ బాక్స్ ఆధారంగా ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఈ రిపోర్టును రూపొందించినట్లు సమాచారం. ఈ నివేదిక 4-5 పేజీలతో ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా గత నెలలో అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయి 270 మంది మరణించిన విషయం తెలిసిందే.

News July 8, 2025

బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన

image

ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

News July 8, 2025

ఫిష్ వెంకట్‌కు హీరో విశ్వక్ సేన్ సాయం

image

కిడ్నీ సమస్యలతో తెలుగు నటుడు <<16976046>>ఫిష్ వెంకట్<<>> ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందనే సమాచారం తెలుసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మంచి మనసు చాటుకున్నారు. వైద్య అవసరాల కోసం రూ.2లక్షల చెక్కును వెంకట్ కుటుంబానికి అందించారు. అటు సినీ పెద్దలు కూడా ముందుకొచ్చి స్పందించాలని వెంకట్ కుటుంబం వేడుకుంటోంది.