News October 2, 2024
‘ఆరోగ్యమే మహాభాగ్యం’.. గాంధీ ఆరోగ్య రహస్యాలివే!
గాంధీజీ ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. రోజువారీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకునేవారు. ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండే దంపుడు బియ్యాన్ని మాత్రమే తినేవారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయలనే ఇష్టపడేవారు. చక్కెరను పక్కనబెట్టి బెల్లం టీ తాగేవారు. రోజూ 15 కి.మీ నడవడంతో పాటు ప్రాణాయామం, వ్యాయామాలు చేసేవారు. ధూమపానం, మద్యపానం, మాంసాహారానికి బాపూజీ దూరం.
Similar News
News October 11, 2024
సచిన్ రికార్డును రూట్ బద్దలుగొడతారు.. కానీ..: వాన్
టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్‌కు ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ కేవలం 3వేల పరుగుల దూరంలోనే ఉన్నారు. ఆ రికార్డును అందుకునే సత్తా రూట్‌కి ఉందని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ అన్నారు. ‘రూట్ కచ్చితంగా ఆ రికార్డును సాధిస్తారు. అయితే దాని కోసం అతడు సుదీర్ఘకాలం ఆడాలి. క్రికెట్ అంటే అతనికి ప్రాణం. కచ్చితంగా అలా ఆడతారనే అనుకుంటున్నా. రూట్ ఇప్పటికే ఓ దిగ్గజం’ అని కొనియాడారు.
News October 11, 2024
మేం చదువు చెబితే కేసీఆర్ గొర్రెలు, బర్రెలు ఇచ్చారు: రేవంత్
TG: తాము 90 రోజుల్లోనే 30వేల మందికి ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పిల్లలకు విద్య, పేదలకు వైద్యం ఇవ్వడం తమ విధానం అయితే.. చేపలు, గొర్రెలు, బర్రెలు ఇవ్వడం కేసీఆర్ విధానం అని ఫైరయ్యారు. కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటూ వేర్వేరుగా స్కూళ్లు పెట్టారని, కానీ తమ ప్రభుత్వం అన్ని కులాల పిల్లలు ఒకే దగ్గర చదువుకునేలా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
News October 11, 2024
ఎన్డీయేకు మద్దతు ఉపసంహరించుకోండి.. నితీశ్‌ను కోరిన అఖిలేశ్
NDA ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బిహార్ సీఎం నితీశ్‌ను కోరారు. జయప్రకాశ్ నారాయణ జయంతి సందర్భంగా లక్నోలోని JPNICకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో నితీశ్‌కు అఖిలేశ్ ఈ మేరకు విన్నవించారు. దీంతో ఆయన ఇంటి బయటే ఉన్న JP విగ్రహానికి నివాళులర్పించారు. ‘విధ్వంసకర భావాలున్న BJP, CM యోగికి JP లాంటి మహనీయుల గొప్పదనం ఏం తెలుసు?’ అంటూ అఖిలేశ్ మండిపడ్డారు.