News March 25, 2024

జులై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులు: మంత్రి శ్రీధర్

image

TG: రాష్ట్రంలోని ప్రజలందరికీ జులై నుంచి హెల్త్ ప్రొఫైల్ కార్డులను ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆధార్ నంబర్ తరహాలో ఒక్కో పౌరుడికి స్మార్ట్ కార్డు వంటి హెల్త్ ప్రొఫైల్ సంఖ్యను ఇస్తామన్నారు. పేరు ఎంటర్ చేయగానే ఆ వ్యక్తికి సంబంధించిన వైద్య సేవల వివరాలు తెలుస్తాయని, ఏ డాక్టర్‌ను సంప్రదించినా వెంటనే ఆరోగ్య స్థితిగతులను తెలుసుకుని వైద్యం చేసేందుకు వీలుంటుందని పేర్కొన్నారు.

Similar News

News September 12, 2024

మదనపల్లె తహశీల్దార్ ఆఫీసులో సీఐడీ తనిఖీలు

image

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో దస్త్రాల దహనం ఘటనపై సీఐడీ విచారణ జరుపుతోంది. ఇవాళ మదనపల్లె తహశీల్దార్ కార్యాలయంలో సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యుల బృందం తనిఖీలు చేపట్టింది. కోళ్లబైలు పరిధిలోని ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

News September 12, 2024

చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. వ్యక్తిగత పనులపై విజయవాడ వెళ్లిన ఉత్తమ్ దంపతులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లోని రాజకీయాలు, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

News September 12, 2024

సీటు బెల్టు ధరించిన గణనాథుడు

image

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించేందుకు రాచకొండ పోలీసులు ఇంట్రెస్టింగ్ ఫొటోను షేర్ చేశారు. ఉప్పల్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు ట్రాఫిక్ సీఐ లక్ష్మీమాధవి కారులో తీసుకెళ్లారు. ఆమె తాను సీటు బెల్ట్ ధరించడంతో పాటు వినాయకుడికి కూడా బెల్టు పెట్టడం విశేషం. అంతటి గణపయ్యనే సేఫ్టీ కోసం సీటు బెల్టు ధరించినప్పుడు మనమెందుకు అలా చేయకూడదు అని పోలీసులు ట్వీట్ చేశారు.