News December 6, 2024

నగదు విషయం తొలిసారి వింటున్నా: సింఘ్వీ

image

రాజ్యసభలో తన సీటు వద్ద భారీగా <<14804617>>నగదు దొరకడంపై<<>> కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనుసింఘ్వీ స్పందించారు. నగదు విషయం తొలిసారి ఇప్పుడే విన్నానని చెప్పారు. ‘నేను సభకు వెళ్తున్నప్పుడు ఒక్క రూ.500 నోటు మాత్రమే తీసుకెళ్తా. నిన్న మధ్యాహ్నం 3 నిమిషాలే సభలో ఉన్నా. తర్వాత క్యాంటీన్‌లో అయోధ్య రామిరెడ్డితో కలిసి పలు అంశాలపై 30 నిమిషాలు మాట్లాడి వెళ్లిపోయా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News January 26, 2025

జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి

image

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కఢ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతలు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

News January 26, 2025

యుద్ధ వీరులకు ప్రధాని మోదీ నివాళి

image

ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళి అర్పించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికుల త్యాగాలను మోదీ స్మరించుకున్నారు. ఆయన వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు ఉన్నారు. అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

News January 26, 2025

స్వర్ణాంధ్ర విజన్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు: గవర్నర్

image

AP: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ నజీర్ అన్నారు. విజయవాడలో గణతంత్ర వేడుకల్లో మాట్లాడుతూ ‘గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించింది. స్వర్ణాంధ్ర విజన్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేసింది. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే ప్రభుత్వ నినాదం’ అని వ్యాఖ్యానించారు.