News December 31, 2024

KTR పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

image

TG: తనపై నమోదైన ACB కేసు కొట్టేయాలంటూ మాజీ మంత్రి KTR దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. కేసులో ఆరోపణలు ఏంటని ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని, ACB చట్టం, నేరపూరిత కుట్ర సెక్షన్లు పెట్టినట్లు PP కోర్టుకు వివరించారు. ప్రజాధనం దుర్వినియోగం చేశారని KTRపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Similar News

News January 14, 2025

మరికాసేపట్లో మకరజ్యోతి

image

మరికాసేపట్లో శబరిమలలో మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తరించేందుకు అయ్యప్ప మాలధారులు, భక్తులు భారీగా శబరిమలకు చేరుకున్నారు. భక్తుల శరణుఘోషతో శబరిగిరులు మార్మోగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

News January 14, 2025

అడిగిన ప్రతి రైతుకూ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు: సీఎం చంద్రబాబు

image

AP: సంక్షేమ పథకాల అమలులో మోసాలు జరగకుండా సాంకేతికతను వినియోగిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. రైతుల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అడిగిన ప్రతి ఒక్కరికీ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తామని, పశువులకు షెడ్లు నిర్మిస్తామని ప్రకటించారు. కిరాణా దుకాణాల ద్వారా సరకుల పంపిణీ చేపడతామన్నారు. ప్రజల ఆదాయం పెంచడం, పర్యావరణ పరిరక్షణే తన లక్ష్యమని పేర్కొన్నారు.

News January 14, 2025

సేంద్రియ సాగుకు మరింత ప్రోత్సాహం: సీఎం

image

AP: రాష్ట్రంలో సేంద్రియ సాగుకు తానే శ్రీకారం చుట్టానని, రానున్న రోజుల్లో మరింత ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. నారావారిపల్లెలో మాట్లాడుతూ ‘ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయి. అలాంటి ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి ధర వస్తోంది. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన పెరిగింది. తినే ఆహారం ఎలాంటిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే అవకాశం వచ్చింది’ అని తెలిపారు.