News March 19, 2024

నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ

image

AP: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారించనుంది. స్కిల్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేయడాన్ని సీఐడీ సుప్రీంలో సవాల్ చేసింది. దీంతో కోర్టు తీర్పుపై ఆసక్తి నెలకొంది.

Similar News

News July 5, 2024

నిన్నటి ఈవెంట్ బీసీసీఐకి ఓ స్ట్రాంగ్ మెసేజ్: ఆదిత్య ఠాక్రే

image

నిన్న ముంబైలో జరిగిన T20 వరల్డ్ కప్ విజయోత్సవం ముంబై నుంచి WC ఫైనల్‌ను తీసివేయొద్దనే ఓ స్ట్రాంగ్ మెసేజ్‌ని బీసీసీఐకి ఇచ్చాయని శివసేన(UBT) నేత ఆదిత్య ఠాక్రే ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ గత ఏడాది వన్డే WC ఫైనల్ ముంబైలో కాకుండా అహ్మదాబాద్‌లో నిర్వహించడం గురించే చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహించినా అభిమానులు పోటెత్తేవారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

News July 5, 2024

బాబర్ కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోలేదు: PCB ఛైర్మన్

image

T20 WCలో పాక్ ఘోర పరాభవంతో బాబర్ ఆజమ్ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అతడిని కెప్టెన్‌గా తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై PCB ఛైర్మన్ మోసిన్ నఖ్వీ స్పందించారు. భవిష్యత్తులో కెప్టెన్‌‌గా బాబర్ కొనసాగడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీనిపై త్వరలోనే కోచ్ కిర్‌స్టెన్, మాజీ ఆటగాళ్ల అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు. జట్టుకు ‘మేజర్ సర్జరీ’ అవసరమంటూ WCలో ఓటమి అనంతరం నఖ్వీ వ్యాఖ్యానించారు.

News July 5, 2024

రాబోయే రెండేళ్లలో అదనంగా 10వేల నాన్ ఏసీ కోచ్‌లు: రైల్వే

image

రైళ్లలో సాధారణ ప్రయాణికుల ఇక్కట్లను తీర్చే దిశగా రైల్వే మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌‌ను తీర్చేందుకు రాబోయే రెండేళ్లలో 10వేల నాన్-ఏసీ కోచ్‌ల తయారీ‌కి ప్రణాళికలు రూపొందించింది. 2024-25లో 4,485 కోచ్‌లు, 2025-26లో 5,444 కోచ్‌లు తయారు చేయనున్నట్లు రైల్వే అధికారి తెలిపారు. దీనికి అదనంగా మరో 5,300 జనరల్ కోచ్‌లు రూపొందించాలని యోచిస్తోంది.