News October 3, 2024
అనర్హత పిటిషన్లపై 24న విచారణ
TG: బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. 24న మరోసారి వాదనలు వింటామని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే తామే సుమోటోగా విచారిస్తామని సింగిల్ బెంచ్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీన్ని అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు.
Similar News
News November 11, 2024
ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టుబట్టి గ్రూప్-1 జరిపా: CM
TG: గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క గ్రూప్-1 కూడా నిర్వహించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. 2011లో చివరిసారిగా గ్రూప్-1 నిర్వహించారని, దాదాపు 13 ఏళ్ల పాటు పోస్టులు భర్తీ చేయలేదన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టుబట్టి గ్రూప్-1 జరిపానని, ఎంపికైన వారికి త్వరలో నియామకపత్రాలు అందిస్తానని పేర్కొన్నారు.
News November 11, 2024
KL రాహుల్ లాంటి ప్లేయర్ ఎన్ని జట్లకు ఉన్నారు: గంభీర్
ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న KL రాహుల్‌కు కోచ్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచారు. అతడిలాంటి ప్లేయర్ అసలు ఎన్ని జట్లకు ఉన్నారని ప్రశ్నించారు. ‘KL ఓపెనింగ్ నుంచి 6డౌన్ వరకు బ్యాటింగ్ చేస్తారు. అలా ఆడాలంటే స్పెషల్ టాలెంట్ కావాలి. పైగా వన్డేల్లో కీపింగ్ చేయగలరు. రోహిత్ లేకుంటే ఓపెనర్‌గా అతడూ ఓ ఆప్షన్’ అని BGT సిరీసుకు ముందు గౌతీ అన్నారు. చాన్నాళ్లుగా KL రన్స్ చేయలేక జట్టులోకి వస్తూ పోతూ ఉన్నారు.
News November 11, 2024
బడి దొంగలను చూశాం కానీ.. KCRపై సీఎం సెటైర్
TG: ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని తాము అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బడి దొంగలను చూశాం కానీ అసెంబ్లీకి రాని వారిని ఇప్పుడే చూస్తున్నాం అని సెటైర్ వేశారు. శాసనసభకు వచ్చి సమస్యలపై చర్చించడం ప్రతిపక్ష నేత బాధ్యత అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ కూడా కట్టలేదు కానీ ఆయన మాత్రం 10 ఎకరాల్లో ఫాంహౌస్ కట్టుకున్నారని రేవంత్ విమర్శించారు.