News December 13, 2024
జగన్ కేసులపై విచారణ వాయిదా

మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలు నిన్న ఫైల్ చేసినట్లు సీబీఐ తరఫు లాయర్ ధర్మాసనానికి వివరించారు. అయితే సీబీఐ స్టేటస్ రిపోర్ట్ కాపీని పరిశీలిస్తామని కోర్టు తెలపగా తామూ పరిశీలిస్తామని, అందుకు సమయం కావాలని జగన్ తరఫు లాయర్ కోరారు. దీంతో విచారణను జనవరి 10కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
Similar News
News September 14, 2025
కౌరవుడే అయినా.. అన్యాయాన్ని ఎదురించాడు!

మహాభారతంలో ఎందరికో తెలియని పాత్రలెన్నో ఉన్నాయి. అందులో వికర్ణుడి పాత్ర ఒకటి. ఆయన కౌరవుడే అయినప్పటికీ ద్రౌపది వస్త్రాపహరణం వంటి అధర్మ కార్యాలను వ్యతిరేకించాడు. ధ్రుతరాష్ట్రుడు, ద్రోణుడు, కృపాచార్యుడు వంటి పెద్దలు నిలబడి చోద్యం చూసినా వికర్ణుడు ఊరుకోలేదు. కౌరవ అగ్రజుడైన ధుర్యోదనుడినే ఎదురించాడు. కానీ, రక్త సంబంధానికి కట్టుబడి కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన పోరాడాడు. భీముడితో తలపడి వీరమరణం పొందాడు.
News September 14, 2025
IOCLలో 523 అప్రెంటిస్లు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(<
News September 14, 2025
వాటర్ క్యాన్ ఎంత కాలం వాడుతున్నారు?

వాటర్ క్యాన్లను కొందరు నెలలకొద్దీ, మరికొందరు ఏళ్ల పాటు వాడుతుంటారు. ఇది ప్రమాదకరమని, 3 నెలలే వినియోగించాలని వైద్యులు చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ రోజులు వాడితే క్యాన్లలో ఆల్కలైన్ ఏర్పడి ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే, TDS 50-150ppm మధ్య ఉండే నీటినే తీసుకోవాలని, ఎక్కువున్న నీటిని తాగితే కీళ్ల నొప్పులు, ఎసిడిటీ, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.