News December 13, 2024

జగన్ కేసులపై విచారణ వాయిదా

image

మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు బదిలీ, బెయిల్ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలు నిన్న ఫైల్ చేసినట్లు సీబీఐ తరఫు లాయర్ ధర్మాసనానికి వివరించారు. అయితే సీబీఐ స్టేటస్ రిపోర్ట్ కాపీని పరిశీలిస్తామని కోర్టు తెలపగా తామూ పరిశీలిస్తామని, అందుకు సమయం కావాలని జగన్ తరఫు లాయర్ కోరారు. దీంతో విచారణను జనవరి 10కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Similar News

News January 14, 2025

భారత క్రికెటర్లకు BCCI షాక్?

image

ఆస్ట్రేలియాతో BGT సిరీస్ వైఫల్యంతో BCCI ప్లేయర్లకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఆటతీరు ప్రకారం చెల్లింపులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం పర్ఫార్మెన్స్ సరిగా లేకుంటే వారి సంపాదనలో కోత పడనుంది. ఈ నిర్ణయంతో క్రికెటర్లు అలర్ట్‌గా ఉంటారని కొందరు అంటుంటే.. ఒత్తిడి పెరుగుతుందని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది కరెక్టేనా? మీ కామెంట్?

News January 14, 2025

‘గేమ్ ఛేంజర్’ హిందీ కలెక్షన్స్ ఎంతంటే?

image

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా హిందీ వెర్షన్‌కు 4 రోజుల్లో ₹29.01కోట్ల వసూళ్లు (నెట్) వచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు ₹8.64 కోట్లు రాగా, తర్వాతి 3 రోజుల్లో వరుసగా ₹8.43, ₹9.52, ₹2,42 వచ్చినట్లు పేర్కొన్నాయి. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా తొలి రోజు ₹186కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందనేది వెల్లడించాల్సి ఉంది.

News January 14, 2025

జాతీయ పసుపు బోర్డు ప్రారంభం

image

TG: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ విధానంలో దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్, పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యేలు సూర్యనారాయణ, రాకేశ్ రెడ్డి, పెద్దఎత్తున రైతులు పాల్గొన్నారు.