News August 20, 2024
జగన్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా

AP: సెప్టెంబర్లో యూకే వెళ్లేందుకు అనుమతి కోరిన మాజీ సీఎం జగన్ పిటిషన్పై విచారణను సీబీఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. అటు సెప్టెంబర్, అక్టోబర్లో యూరప్ వెళ్లేందుకు అనుమతించాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సైతం పిటిషన్ వేశారు. విచారణను సీబీఐ కోర్టు ఈనెల 30కి వాయిదా వేసింది.
Similar News
News January 26, 2026
ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్ అప్డేట్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ‘డ్రాగన్’ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. RFCలో జరిగిన చిత్రీకరణలో నైట్ ఎఫెక్ట్ సీన్లు తీసినట్లు సినిమాటోగ్రఫీ విభాగంలో పనిచేస్తోన్న ప్రజ్వల్ ఇన్స్టాలో వెల్లడించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీలో యాక్షన్ సీన్లు అద్భుతంగా ఉంటాయని సినీవర్గాలు చెబుతున్నాయి. NTR కెరీర్లోనే అత్యుత్తమ సినిమాగా ‘డ్రాగన్’ ఉండనున్నట్లు సమాచారం.
News January 26, 2026
భారత్కు కెనడా ప్రధాని! సంబంధాలు గాడిన పడినట్లేనా?

కెనడా PM మార్క్ కార్నీ మార్చిలో భారత్కు వచ్చే అవకాశం ఉంది. యురేనియం, ఎనర్జీ, మినరల్స్, AI వంటి రంగాల్లో ఒప్పందాలు కుదిరే ఛాన్స్ ఉందని భారత్లోని ఆ దేశ హై కమిషనర్ దినేశ్ పట్నాయక్ వెల్లడించారు. USతో కెనడాకు ఈ మధ్య చెడింది. మరోవైపు కెనడా మాజీ PM ట్రూడో అధికారంలో ఉండగా భారత్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో కార్నీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
News January 26, 2026
అలాంటి రేప్ కేసులు చెల్లవు: హైకోర్టు

వెస్ట్రన్ కల్చర్ ప్రభావంతో యువతలో లివ్ ఇన్ రిలేషన్షిప్ ధోరణి పెరిగిందని అలహాబాద్ హైకోర్టు అభిప్రాయపడింది. బ్రేకప్ తర్వాత మహిళల అత్యాచార ఆరోపణలతో పురుషులపై FIRలు నమోదవుతున్నాయని పేర్కొంది. కిడ్నాప్, రేప్ కేసు ఎదుర్కొంటున్న వ్యక్తికి దిగువకోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. బాధితురాలు ఇష్టపూర్వకంగా అతడితో వెళ్లినందున ఆరోపణలు చెల్లవని, పైగా ఆ సమయంలో ఆమె మేజర్ అని స్పష్టం చేసింది.


