News May 10, 2024

కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

BRS MLC కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ కవిత హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ ఆమె వాదనలు విన్న ధర్మాసనం.. కవిత బెయిల్ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ఈడీని ఆదేశించింది. ఈమేరకు తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది.

Similar News

News January 10, 2026

జమ్మూ: సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్

image

జమ్మూ కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ ప్రవేశించడం కలకలం రేపింది. BSF బలగాలు డ్రోన్ కదలికలను గుర్తించాయి. డ్రోన్ ద్వారా పాక్ ఆయుధాలు జార విడిచినట్లు తెలుస్తోంది. ఫ్లోరా గ్రామం వద్ద భద్రతా బలగాలు ఆయుధాలను గుర్తించాయి. 2 పిస్టల్స్, గ్రెనేడ్, 16 రౌండ్ల బుల్లెట్లు, 3 పిస్టల్ మ్యాగజైన్లు స్వాధీనం చేసుకున్నాయి.

News January 10, 2026

బీపీ తగ్గాలంటే ఇవి తినాలి

image

హైబీపీకి ఎన్నో కారణాలుంటాయి. దాన్ని అదుపులో ఉంచుకోకపోతే అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే పొట్టుతో ఉన్న గింజధాన్యాలతోపాటు ఆకుకూరలు, కాయగూరలు, అల్లం, వెల్లుల్లి వంటివి తీసుకోవాలి. రైస్‌బ్రాన్, నువ్వులు, ఆవ నూనెల్ని నాలుగైదు చెంచాలకు మించి వాడకూడదు. సలాడ్స్‌, నాటుకోడి, చేప తినొచ్చు. వీటితో పాటు ఒత్తిడినీ నియంత్రించుకోగలిగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.

News January 10, 2026

మెడ నలుపు తగ్గాలంటే?

image

హార్మోన్ల మార్పులు, కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల మెడ నల్లగా మారుతుంది. దీన్ని తొలగించడానికి ఈ చిట్కాలు. * పెరుగు, నిమ్మరసం కలిపి మెడకు రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. * పసుపు, పాలు కలిపి మెడకి అప్లై చేయాలి. దీన్ని 20నిమిషాల తర్వాత కడిగేయాలి. * అలోవెరాజెల్‌‌, కాఫీపొడి, పసుపు కలిపి మెడకి రాసి, ఆరాక నీటితో స్క్రబ్ చేయాలి. మరిన్ని స్కిన్, హెయిర్ కేర్ టిప్స్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.