News August 27, 2024
నేడు కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ

TG: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఈ నెల 7న ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ నేపథ్యంలో BRS ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు నిన్న ఢిల్లీకి చేరుకొని కవిత తరఫు అడ్వకేట్లతో సమావేశమయ్యారు.
Similar News
News April 10, 2026
మావిగన్‌తో మరుసటి రోజే రాజధాని: సజ్జల

AP: చంద్రబాబు లెక్క ప్రకారం అమరావతి పూర్తి కావాలంటే రూ.2-3 లక్షల కోట్లు కావాలని, అందుకు 30-40 ఏళ్లు పడుతుందని YCP రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కానీ జగన్ సూచించిన మావిగన్‌లో 10% ఖర్చుతో మరుసటి రోజే రాజధాని అవుతుందని చెప్పారు. మావిగన్ ప్రాంతం ఇప్పటికే ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్లతో ప్రపంచానికి అనుసంధానమై ఉందని, త్వరలోనే పోర్టు కూడా వస్తుందని తెలిపారు.
News April 10, 2026
ఫిట్‌గా ఉంటే హెల్తీగా ఉన్నట్లేనా?

చాలామంది ఫిట్‌గా ఉంటే హెల్తీగా ఉన్నట్లే అనుకుంటారు. కానీ రెండూ వేరు. హెల్త్ మన శరీరం లోపల అవయవాలు ఎలా పనిచేస్తున్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది. మంచి నిద్ర, బ్యాలెన్స్‌డ్ ఫుడ్, తక్కువ స్ట్రెస్ ఉంటే హెల్తీగా ఉన్నట్లు లెక్క. మరోవైపు ఫిట్‌నెస్ అంటే శారీరక సామర్థ్యం. బరువులు ఎత్తడం, వేగంగా పరుగెత్తడం వంటివి ఫిట్‌నెస్‌ను సూచిస్తాయి. ఒక బాడీబిల్డర్ చూడటానికి చాలా ఫిట్‌గా ఉన్నా లోపల హెల్తీగా లేకపోవచ్చు.
News April 10, 2026
జాబ్ ఆఫర్ చేసిన MNC.. షాక్ ఇచ్చిన అభ్యర్థి

జాబ్ ఆఫర్ చేసిన కంపెనీకే షాక్ ఇచ్చాడు కన్సల్టెంటుగా పనిచేసిన ఓ అభ్యర్థి. ‘ఓ MNCలో అన్నీ అధ్వానంగా ఉంటాయి. నా CVకి సరిపోయే జాబ్ ఉందని ఆ కంపెనీ నుంచి కాల్ వచ్చింది. కానీ వాళ్ల సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టానని, అందులో పని చేయనని చెప్పేశా. ఇవి పిల్ల చేష్టలని అనుకోవచ్చు. కానీ అదెంతో అద్భుతంగా, సంతృప్తిగా అనిపించింది. మళ్లీ సంప్రదిస్తే CEO ఏడ్చేలా ఈ-మెయిల్ పంపుతా’ అని రెడిట్‌లో రాసుకొచ్చారు.


