News July 22, 2024
కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన BRS MLC కవిత పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ఆగస్టు 5కు వాయిదా పడింది. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఇవాళ విచారించింది. అనారోగ్యానికి గురైన ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కవిత తరఫు లాయర్లు కోర్టును కోరారు.
Similar News
News December 9, 2024
సివిల్స్ ఫలితాలు విడుదల
సివిల్స్-2024 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూలకు ఎంపికైన వారి జాబితాను UPSC రిలీజ్ చేసింది. ఇక్కడ <
News December 9, 2024
తెలంగాణ తల్లి విగ్రహ నమూనా మారిస్తే చట్టపరమైన చర్యలు: సీఎం
TG: డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు CM రేవంత్ తెలిపారు. ‘భవిష్యత్తులో విగ్రహ నమూనా మార్చాలన్నా, ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలని చూసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. విగ్రహం మార్పు వల్ల తమ భవిష్యత్తు అంధకారం అవుతుందని కొందరు భయపడుతున్నారు’ అని రేవంత్ విమర్శించారు.
News December 9, 2024
గత పాలకులు తెలంగాణ తల్లిని విస్మరించారు: సీఎం రేవంత్
TG: ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష కోసం ఆనాడు పార్టీలు పోరాటం చేశాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘ఆలె నరేంద్ర, విజయశాంతి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంటి వారు తమ రాజకీయ పార్టీల ఆలోచన, విధివిధానాలకు అనుగుణంగా తెలంగాణ తల్లి ప్రతిమను సృష్టించుకుని ముందుకు కొనసాగాయి. కానీ 2014లో జూన్ 2న రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాన్ని గత పాలకులు నిర్వహించలేదు’ అని సీఎం విమర్శించారు.