News March 22, 2024
నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ
TG: ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను క్వాష్ చేయాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.
Similar News
News September 21, 2024
లంకాధిపతి ఎవరో? నేడే అధ్యక్ష ఎన్నిక
ఆర్థిక, ఆహార సంక్షోభంతో అల్లాడి కోలుకుంటున్న శ్రీలంకలో ఇవాళ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 13,421 పోలింగ్ కేంద్రాల్లో 1.7 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 38 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా సిట్టింగ్ ప్రెసిడెంట్ రణిల్ విక్రమ సింఘే(యునైటెడ్ నేషనల్ పార్టీ), ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస(బలవేగాయ పార్టీ), కుమార దిస్సనాయకే(నేషనల్ పీపుల్స్ పవర్) మధ్యే పోటీ ఉండనుంది.
News September 21, 2024
చరిత్ర సృష్టించిన అఫ్గాన్
రెండో వన్డేలో సౌతాఫ్రికాపై 177 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన అఫ్గానిస్థాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డేల్లో రన్స్ పరంగా ఆ జట్టుకు ఇదే బిగ్గెస్ట్ విన్. గతంలో జింబాబ్వేపై 154, 146, బంగ్లాదేశ్‌పై 142, ఐర్లాండ్‌పై 138 పరుగుల తేడాతో గెలిచింది. ఇక సౌతాఫ్రికాకు ఐదో అతిపెద్ద ఓటమి. గతంలో ఇండియా 243, పాక్ 182, శ్రీలంక 180, 178 రన్స్ తేడాతో ఆ జట్టుపై విజయం సాధించాయి.
News September 21, 2024
రేట్ల ఎఫెక్ట్.. BSNLకు పెరిగిన యూజర్లు
ఈ ఏడాది జులై మొదటి వారంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా టారిఫ్ ధరలకు 10-27 శాతం పెంచాయి. దీంతో యూజర్లు ఆ ప్రైవేటు టెలికాం కంపెనీలకు షాకిచ్చారు. జులైలో ఎయిర్‌టెల్ 16.9 లక్షలు, VI 14.1 లక్షలు, జియో 7.58 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. అదే సమయంలో BSNLలోకి ఏకంగా 29 లక్షల మంది చేరారు. ధరలు చాలా తక్కువగా ఉండటంతో ఈ ప్రభుత్వ రంగ సంస్థ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.