News June 27, 2024

KCR పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

image

TG: పవర్ కమిషన్‌ను రద్దు చేయాలని KCR వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇవాళ విచారణ సందర్భంగా ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ‘విద్యుత్ కమిషన్ తీరు నిబంధనలకు విరుద్ధం. నోటీసులకు KCR సమాధానం ఇవ్వకముందే ఛైర్మన్ ప్రెస్‌మీట్ పెట్టారు. ERC నిర్ణయం మేరకే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయి. విద్యుత్ నియంత్రణ కమిషన్ న్యాయబద్ధ సంస్థ. దీనిపై విచారణ కమిషన్ వేయకూడదు’ అని అన్నారు.

Similar News

News February 13, 2025

తెలంగాణపై వివక్ష లేదు: నిర్మలా

image

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్న కాంగ్రెస్ MPల ఆరోపణలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ‘తెలంగాణకు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, జహీరాబాద్‌లో ఇండస్ట్రియల్ నోడ్ మంజూరు చేశాం. 2014 నుంచి TGలో 2605K.Mల హైవేలు నిర్మించాం. ఈ ఏడాది రైల్వేలో రూ.5337 కోట్లు కేటాయించాం. 5 వందేభారత్ రైళ్లు మంజూరు చేశాం. 2 లక్షల ఇళ్లు, 31 లక్షల మరుగుదొడ్లు, 38 లక్షల నల్లా కనెక్షన్లు అందించాం’ అని చెప్పారు.

News February 13, 2025

ఆన్‌లైన్‌లో కొన్న వస్తువులను రిటర్న్ చేస్తున్నారా?

image

ఆన్‌లైన్‌లో కొన్న వస్తువు నచ్చకపోతే రిటర్న్ పంపించేస్తుంటాం. అయితే అలా రిటర్న్ చేయడంలో ఇండియన్సే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. భారతీయులు 100 ప్రొడక్ట్స్ కొంటే అందులో 81 రిటర్న్ చేస్తున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఆ తర్వాత చైనా (66), జర్మనీ (54), యూకే (50), అమెరికా (48), స్పెయిన్ (48), సౌత్ కొరియా (47), ఫ్రాన్స్ (46), ఆస్ట్రేలియా (44) దేశాలున్నాయి. INDలో ఎక్కువ మంది ఎందుకు రిటర్న్ పంపుతున్నారు?

News February 13, 2025

జట్టులో అంతమంది స్పిన్నర్లు ఎందుకు?: అశ్విన్

image

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విస్మయం వ్యక్తం చేశారు. ‘ఒక టూర్‌లో ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మరీ ఐదుగురు స్పిన్నర్లా..? అది కూడా దుబాయ్ పిచ్‌లో ఆడేందుకు? మరీ ఎక్కువమందిని తీసుకున్నారనిపిస్తోంది. జడేజా, అక్షర్, కుల్‌దీప్, వరుణ్, సుందర్‌లో ఎవర్ని ఆడిస్తారు? ఎవర్ని పక్కన పెడతారు?’ అని ప్రశ్నించారు.

error: Content is protected !!