News January 6, 2025

నేడు పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ

image

AP: మాజీ మంత్రి పేర్ని నాని వేసిన బెయిల్ ముందస్తు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఆయన ఫ్యామిలీకి చెందిన గోదాములో రేషన్ బియ్యం మాయమైన ఘటనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని ఫ్యామిలీ ఉండగా, ఆయన భార్య‌కు మచిలీపట్నం కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పేర్ని నాని ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా నేడు విచారణ జరగనుంది.

Similar News

News January 20, 2025

MLC కవిత ఫొటోల మార్ఫింగ్.. పోలీసులకు ఫిర్యాదు

image

TG: MLC కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్‌ పోలీసులకు తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఫిర్యాదు చేసింది. కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి Xలో పోస్ట్ చేసిన హ్యాండిల్స్‌తో పాటు దీని వెనక ఉన్న వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. ఒక రాజకీయ పార్టీకి చెందిన కీలక నాయకుడి ఆర్మీ పేరిట సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ఫొటో మార్ఫింగ్ చేస్తున్నారని ఆరోపించింది.

News January 20, 2025

ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కనున్న రింకూ సింగ్

image

భారత యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ పెళ్లికి ఎంపీ ప్రియా సరోజ్‌ తండ్రి తుఫానీ ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య జరిగిన చర్చల తర్వాత ఇద్దరి పెళ్లికి తాము ఒప్పుకున్నట్లు ఆయన PTIకి వెల్లడించారు. ‘రింకూ, ప్రియా ఒకరికొకరు ఏడాదిన్నరగా తెలుసు. వారిద్దరూ ఇష్టపడ్డారు. ఇరు కుటుంబాలు తాజాగా అంగీకారానికి వచ్చాయి. నిశ్చితార్థం& పెళ్లి తేదీలు పార్లమెంట్ సమావేశాల తర్వాత నిర్ణయిస్తాం’ అని తుఫానీ పేర్కొన్నారు.

News January 20, 2025

వెళ్తూ వెళ్తూ బైడెన్ సంచలన నిర్ణయం

image

మరికొద్ది గంటల్లో అధ్యక్షుడి కుర్చీ నుంచి దిగబోతున్న జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య నిపుణులు, కొవిడ్ రెస్పాన్స్ చీఫ్ డా.ఆంటోనీ ఫౌచీ, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లె, క్యాపిటల్ హిల్ దాడులపై విచారణ జరిపిన హౌస్ కమిటీ సభ్యులకు ముందస్తు క్షమాభిక్ష ప్రకటించారు. బైడెన్ తనకున్న అసాధారణ అధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ట్రంప్ ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.