News February 21, 2025
వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో YCP నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణను విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు పోలీసులు సమయం కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయన కస్టడీ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. కస్టడీ, హెల్త్ పిటిషన్లపై కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.
Similar News
News February 22, 2025
ALERT.. మార్చి 1 నుంచి జాగ్రత్త

ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. మార్చి 1 నుంచి తెలంగాణలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 35.3 డిగ్రీల నుంచి 38.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ASF(D) పెంచికల్‌పేటలో అత్యధికంగా 38.2 డిగ్రీలు, జగిత్యాల(D) బీర్‌పూర్‌లో 38.1, నిర్మల్(D) గింగాపూర్‌లో 38.1, నాగర్‌కర్నూల్(D) పెద్దముద్నూర్‌లో 38 డిగ్రీల చొప్పున టెంపరేచర్ రికార్డయింది.
News February 22, 2025
రోహిత్‌పై పాక్ దిగ్గజం పొగడ్తలు

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించారు. హిట్ మ్యాన్ లేజీగా ఉన్నా చాలా ప్రత్యేకమని కొనియాడారు. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేశారని తెలిపారు. 2008లో ఓ ట్రై సిరీస్ ఆడుతున్న సమయంలో అతనిలో సత్తా ఉందని గమనించినట్లు పేర్కొన్నారు. రోహిత్ 10 ఓవర్ల పాటు క్రీజులో ఉంటే తర్వాత వచ్చే బ్యాటర్లకు ఆట ఈజీగా ఉంటుందన్నారు.
News February 22, 2025
వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు

AP: భూ ఆక్రమణ ఆరోపణలపై రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, కుటుంబీకులకు జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ రాయచోటిలోని కలెక్టరేట్‌లో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా ఆకేపాడు, మందపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాలను ఆకేపాటి కుటుంబం ఆక్రమించిందని టీడీపీ నేతలు ఆరోపించడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.