News February 22, 2025
వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు

AP: భూ ఆక్రమణ ఆరోపణలపై రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, కుటుంబీకులకు జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ రాయచోటిలోని కలెక్టరేట్‌లో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా ఆకేపాడు, మందపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాలను ఆకేపాటి కుటుంబం ఆక్రమించిందని టీడీపీ నేతలు ఆరోపించడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
Similar News
News March 25, 2025
షాకింగ్: వాట్సాప్‌లో పదో తరగతి ప్రశ్నాపత్రం

AP: కడప(D) వల్లూరు సెంటర్‌లో నిన్న గణిత పరీక్ష సమయంలో పేపర్ లీక్ అయిందని DEO షంషుద్దీన్ తెలిపారు. వాటర్ బాయ్‌గా పనిచేసే సాయి మహేశ్ ఫొటో తీసి వివేకానంద స్కూల్లో పనిచేస్తున్న విఘ్నేశ్వర్ రెడ్డికి వాట్సాప్ చేసినట్లు గుర్తించారు. విచారణ అనంతరం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. 2 రోజుల క్రితం TGలోని నకిరేకల్‌లోనూ టెన్త్ పేపర్ లీకైంది.
News March 25, 2025
బ్యూటిఫుల్ కపుల్.. 64 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి!

హర్ష్, మృణు అనే జంట 1960లో పారిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. ఇద్దరి మతాలు వేరవడంతో అప్పట్లో వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అయితే అప్పుడు అనాథలుగా పెళ్లి చేసుకున్న వీరికి ఇప్పుడు మరిచిపోలేని జ్ఞాపకాలను అందించాలని పిల్లలు, మనవళ్లు నిర్ణయించారు. 64 ఏళ్ల తర్వాత వీరికి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. పెళ్లి ఫొటోలు వైరలవుతున్నాయి. చూడ ముచ్చటైన జంట అని నెటిజన్లు కొనియాడుతున్నారు.
News March 25, 2025
పవన్ కళ్యాణ్‌కు ఆ పేరు పెట్టింది నేనే: హుస్సేని

లుకేమియా కారణంగా <<15878066>>చనిపోయిన<<>> కోలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేని ఆస్పత్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘పవన్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌కి తరచుగా వచ్చేవాడు. ఆయన ఎంతో చురుగ్గా ఉండేవారు. నా ఫేవరెట్ స్టూడెంట్. కళ్యాణ్ కుమార్‌గా ఉన్న అతడికి పవన్ అనే పేరు పెట్టాను. నేను చనిపోయాక మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌ను అభివృద్ధి చేయాలి’ అని ఆయన కోరారు.