News January 27, 2025
VSR పిటిషన్‌పై విచారణ వాయిదా

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు ఆయన సీబీఐ కోర్టును అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. దానిపై వాదనలు పూర్తి కాగా, పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఇటీవల రాజకీయాల నుంచి వైదొలిగిన VSR రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 7, 2026
జనవరి 07: చరిత్రలో ఈరోజు

* 1935: కలకత్తాలో భారత జాతీయ సైన్సు అకాడమీని నెలకొల్పారు.
* 1938: నటి బి.సరోజాదేవి జననం
* 1950: సామాజిక సేవకురాలు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా జననం
* 1967: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జననం (ఫోటోలో)
* 1979: బాలీవుడ్ నటి బిపాషా బసు పుట్టినరోజు
* 2008: జైపూర్ ఫుట్ (కృత్రిమ పాదం) సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ మరణం
News January 7, 2026
బాటిల్ మూత రంగుతో నీటిని గుర్తించవచ్చు!

మార్కెట్‌లో దొరికే వాటర్ బాటిల్ మూత రంగును బట్టి అందులోని నీటి రకాన్ని గుర్తించవచ్చు. నీలం రంగు మూత ఉంటే అది సహజ సిద్ధమైన మినరల్ వాటర్. తెలుపు రంగు ప్రాసెస్ చేసిన నీటిని, ఆకుపచ్చ రంగు ఫ్లేవర్డ్ నీటిని సూచిస్తాయి. బ్లాక్ కలర్ ఆల్కలైన్ వాటర్‌కు, రెడ్ ఎనర్జీ డ్రింక్స్‌కు సంకేతం. అయితే ఇది అన్ని కంపెనీలకు తప్పనిసరి నిబంధన కాదు. కొనేముందు లేబుల్ చెక్ చేయడం మంచిది.
News January 7, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


