News January 27, 2025

VSR పిటిషన్‌పై విచారణ వాయిదా

image

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు ఫ్రాన్స్, నార్వే వెళ్లేందుకు ఆయన సీబీఐ కోర్టును అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. దానిపై వాదనలు పూర్తి కాగా, పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఇటీవల రాజకీయాల నుంచి వైదొలిగిన VSR రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Similar News

News February 16, 2025

రేవంత్ ఢిల్లీకి వెళ్లేది అందుకే : కిషన్ రెడ్డి

image

TG: దేశంలో ఏ సీఎం కూడా వారానికోసారి ఢిల్లీ వెళ్లినట్టు చరిత్రలో లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో అటెండెన్స్ వేసుకుంటున్నారని ఆరోపించారు. రాహుల్ డైరక్షన్ లోనే రేవంత్ ప్రధానిపై విమర్శలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల భర్తీ తప్ప.. కాంగ్రెస్ ఇచ్చిన కొత్త ఉద్యోగాలేమి లేవని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.

News February 16, 2025

చావును గెలిచిన పసికందు.. గొంతుకోసినా..!

image

ఆడపిల్లన్న కోపంతో నవజాత శిశువుపై జాలి కూడా లేకుండా సొంత అమ్మమ్మే ఆ పసిదాని గొంతుకోసి చెత్తకుండీలో విసిరేసింది. దారిన పోయేవాళ్లు చూసి ఆస్పత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు మరణంతో పోరాడిన ఆ బుజ్జాయి, వైద్యుల సహాయంతో ఎట్టకేలకు చావును జయించింది. MPలోని భోపాల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బిడ్డపై కర్కశంగా వ్యవహరించిన ఆమె తల్లి, అమ్మమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.

News February 16, 2025

కొత్త హీరోయిన్‌తో లవ్‌లో పడ్డ రామ్ పోతినేని?

image

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల జాబితాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన RAPO22తో బిజీగా ఉండగా ఆ మూవీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో డేటింగ్‌లో ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. లవ్ స్టోరీలో నటిస్తూ ఈ బ్యూటీతో ప్రేమలో పడిపోయాడని పేర్కొన్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. గతంలోనూ హీరోయిన్ అనుపమతో రామ్ ప్రేమలో పడినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!