News September 11, 2024

కాఫీతో గుండెజబ్బుల ముప్పు

image

ఆహారం మితంగా తింటే అమృతం. అపరిమితంగా తింటే విషం. కాఫీ విషయంలోనూ ఇదే నిజం. ఎక్కువ రోజులు 400mg మించి కెఫిన్ తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయని ACC రీసెర్చ్ పేర్కొంది. ఇది 4 కప్పుల కాఫీ, 2 ఎనర్జీ డ్రింక్స్, 10 సీసాల సోడాకు సమానమంది. ఇతర డ్రింక్స్‌లో కలిపి కెఫిన్ తీసుకున్నా ఒక్కసారిగా బీపీ పెరిగి హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని కార్డియాలజిస్ట్ జేసన్ హాపర్ అన్నారు.

Similar News

News November 12, 2025

ప్రకృతి ప్రళయం.. 30 ఏళ్లలో 80వేల మంది మృతి

image

భారత్‌లో గడిచిన 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల కారణంగా 80వేల మంది మరణించినట్లు ‘జర్మన్‌వాచ్’ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్(CRI) నివేదిక తెలిపింది. 1995 నుంచి తుఫాన్లు, వరదలు, హీట్ వేవ్స్ వంటి 430 విపత్తులతో 130 కోట్ల మంది ప్రభావితమయ్యారంది. రూ.లక్షా 50వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు చెప్పింది. ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. డొమెనికా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

News November 12, 2025

కొత్త వాహనాలు కొంటున్నారా?

image

APలో కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికి వారంలోనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించేలా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ నంబర్ రాకపోతే ఆటోమేటిక్‌గా కేటాయింపు జరిగేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయనున్నారు. ప్రస్తుతం శాశ్వత నంబర్ కేటాయింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. రూ.500-1000 ఇస్తేనే నంబర్ ఇస్తామని వాహన డీలర్లు బేరాలాడుతున్నట్లు ఫిర్యాదులొస్తున్నాయి. ఇకపై వీటికి చెక్ పడనుంది.

News November 12, 2025

భారీ జీతంతో రైట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(<>RITES<<>>)17 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి నెలకు జీతం రూ.60వేల నుంచి రూ.2.55లక్షలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com