News August 8, 2024

HEART BREAK: తృటిలో చేజారుతున్న పతకాలు

image

పారిస్ ఒలింపిక్స్‌లో పతకం ఖాయమనుకున్న భారత ప్లేయర్లు గెలుపు అంచులదాకా వెళ్లి ఆగిపోతున్నారు. ఈ సీజన్‌లో షూటింగ్‌లో మనూ భాకర్, అర్జున్, ఆర్చరీలో ధీరజ్-అంకిత ద్వయం, స్కీట్ షూటింగ్‌లో అనంత్ జీత్& మహేశ్వరి జోడీ, బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్, వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి నాలుగో స్థానానికే పరిమితమయ్యారు. కేవలం ఒక్క స్థానంతో పతకాన్ని కోల్పోవడం ఆటగాళ్లతో పాటు అభిమానులకు హార్ట్ బ్రేకింగ్‌గా మారింది.

Similar News

News September 11, 2024

ఆన్‌లైన్‌లో ఫ్రీగా సినిమాలు చూస్తున్నారా?

image

డబ్బులు చెల్లించి OTTలో కాకుండా వివిధ అక్రమ వెబ్‌సైట్ల నుంచి సినిమాలు, వెబ్‌సిరీస్‌లను డౌన్‌లోడ్ చేసుకుని చూడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇటు ప్రేక్షకులు, అటు పైరసీ చేసేవారు పన్ను ఎగవేస్తుండటంతో భారత్ భారీగా ఆదాయం కోల్పోతోంది. అంతేకాదు యూజర్ల వ్యక్తిగత డేటాను డార్క్ వెబ్‌కు అమ్మేస్తున్నట్లు తేలింది. ఆ ఆదాయాన్ని మానవ, ఆయుధాల అక్రమ రవాణా, డ్రగ్స్ కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

News September 11, 2024

‘దేవర’ నుంచి మరో ట్రైలర్?

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీ నుంచి మరో ట్రైలర్ రానున్నట్లు తెలుస్తోంది. నిన్న విడుదల చేసిన ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ రావడంతో మరో ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ నెల 27న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

News September 11, 2024

నేటి నుంచి ఇసుక ఆన్‌లైన్ బుకింగ్

image

AP: ఇవాళ్టి నుంచి ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఏపీ శాండ్ పోర్టల్‌లో ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. ఇసుక రవాణా ఛార్జీల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. గత ప్రభుత్వం విధించిన దానికంటే 30 నుంచి 50 శాతం ఛార్జీలు పెంచాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం మొత్తం ఒకే ధరలు ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. 4.5 టన్నుల ఇసుక ట్రాక్టర్‌కు తొలి 10 కి.మీకు రూ.547 వసూలు చేయనున్నట్లు సమాచారం.