News August 31, 2024
HEART BREAK: శీతల్ దేవి ఓటమి
పారిస్ పారాలింపిక్స్లో భారత స్టార్ ఆర్చర్ <<11958221>>శీతల్ దేవికి<<>> ఎదురుదెబ్బ తగిలింది. ఉమెన్స్ కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ప్రీక్వార్టర్స్లోనే నిష్క్రమించారు. కేవలం ఒక్క పాయింట్ తేడాతో(137-138) తేడాతో మారియానా జునిగా(చిలీ) చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే మిక్స్డ్ టీమ్ విభాగంలో సత్తా చాటేందుకు అవకాశం ఉంది. రెండు చేతులు లేకపోయినా శీతల్ కాళ్లతోనే ఆర్చరీలో అద్భుతాలు చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News January 15, 2025
ఫిబ్రవరి నుంచి KF బీర్లు బంద్
వచ్చే నెల నుంచి తెలంగాణలో వైన్స్లు, బార్లలో KF బీర్లు లభించకపోవచ్చు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ ఆ బ్రాండ్ బీర్లు తయారుచేసే యునైటెడ్ బ్రూవరీ(UB) సంస్థ మద్యం సరఫరా నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న స్టాక్ ఈనెలాఖరు వరకే వస్తుందని దుకాణదారులు చెబుతున్నారు. ఆ తర్వాత వైన్స్ వద్ద కింగ్ ఫిషర్ బీర్లు అందుబాటులో ఉండవు. మరోవైపు లిక్కర్ సరఫరాపై UB కంపెనీతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
News January 15, 2025
రేపు ఈడీ విచారణకు కేటీఆర్
TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఉ.10.30 గంటలకు కేటీఆర్ హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్కు వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిని అధికారులు విచారించారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్ను ఇవాళ సుప్రీం తోసిపుచ్చింది. దీంతో ఆయన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు.
News January 15, 2025
దేశంలో ఎన్నో సమస్యలుంటే.. సైకిల్ ట్రాక్లు కావాలా?: సుప్రీంకోర్టు
‘దేశంలో పేదలకు సరైన నివాస వసతి లేదు. మురికివాడల్లో నివసిస్తున్నారు. విద్యా, ఆరోగ్య సేవల కొరత ఉంది. ప్రభుత్వాలు వీటి కోసం నిధులు ఖర్చు చేయాలా? లేక సైకిల్ ట్రాక్ల కోసమా?’ అని SC ప్రశ్నించింది. దేశంలో సైకిల్ ట్రాక్ల ఏర్పాటుకు ఆదేశాలివ్వాలన్న పిటిషన్ విచారణలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ కాలుష్యం వంటి కారణాలు వివరించగా, ఇలాంటి ఆదేశాలు తామెలా ఇస్తామని SC ప్రశ్నించింది.