News August 31, 2024

HEART BREAK: శీతల్ దేవి ఓటమి

image

పారిస్ పారాలింపిక్స్‌లో భారత స్టార్ ఆర్చర్ <<11958221>>శీతల్ దేవికి<<>> ఎదురుదెబ్బ తగిలింది. ఉమెన్స్ కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ప్రీక్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు. కేవలం ఒక్క పాయింట్ తేడాతో(137-138) తేడాతో మారియానా జునిగా(చిలీ) చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సత్తా చాటేందుకు అవకాశం ఉంది. రెండు చేతులు లేకపోయినా శీతల్ కాళ్లతోనే ఆర్చరీలో అద్భుతాలు చేస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News September 19, 2024

దేశీయ స్టాక్ మార్కెట్లకు ‘ఫెడ్’ బూస్ట్

image

US ఫెడ్ వ‌డ్డీ రేట్ల కోత‌తో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ప్రీ ఓపెన్ మార్కెట్‌లో ఇన్వెస్ట‌ర్లు కొనుగోళ్ల‌కు ఎగ‌బడ్డారు. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 419 పాయింట్లు, నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ఆరంభించాయి. ఎన‌ర్జీ, మోటార్‌, ఫైనాన్స్ రంగ షేర్లు లాభాల‌తో ఓపెన్ అయ్యాయి. ఐటీ, స్టీల్ రంగ షేర్లు న‌ష్టాల‌తో ట్రేడ్ అవుతున్నాయి.

News September 19, 2024

తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

image

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78,690 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,086 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్లు చేకూరింది.

News September 19, 2024

జమిలి ఎన్నికలు: రాజ్యాంగ సవరణలకు ఎంత బలం అవసరం?

image

జమిలీ ఎన్నిక‌ల కోసం చేయాల్సిన రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల‌కు పార్ల‌మెంటులో 2/3 వంతు స‌భ్యుల ఆమోదం అవ‌స‌రం. NDAకి ప్ర‌స్తుతం ఉన్న మ‌ద్ద‌తు ఏ మాత్రం స‌రిపోదు. అద‌నంగా స‌భ్యుల మ‌ద్ద‌తు కూడ‌గ‌డితే తప్పా ఈ సవరణలు ఆమోదం పొందే పరిస్థితి లేదు. లోక్‌స‌భ‌లో NDAకు 293 మంది స‌భ్యుల బలం ఉంటే, స‌వ‌ర‌ణ‌ల ఆమోదానికి 362 మంది మ‌ద్ద‌తు అవ‌స‌రం. ఇక రాజ్య‌స‌భ‌లో 121 మంది బ‌లం ఉంటే, అద‌నంగా 43 మంది స‌భ్యుల బ‌లం అవ‌స‌రం ఉంది.