News August 3, 2024
హృదయవిదారకం.. శిథిలాల్లో బయటపడ్డ బాలిక సర్టిఫికెట్
వయనాడ్‌లోని వెల్లార్‌మాలా ప్రభుత్వ పాఠశాలకు (GVHSS) చెందిన విద్యార్థులు ప్రకృతి ప్రకోపానికి బలవడంతో ఆ ప్రాంతమంతా మూగబోయింది. అక్కడి శిథిలాల్లో అజిలా అనే బాలికకు చెందిన ప్రోత్సాహక సర్టిఫికెట్ బయటపడటం గుండెను పిండేస్తోంది. SSCలో రాణించినందుకు GVHSS ఆ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట షేర్ కాగా ఆ బాలిక ఏమైపోయిందోనని కొందరు, కలలు ఛిద్రమయ్యాయని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 8, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 8, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: సెప్టెంబర్ 08, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున 4:50 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:03 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు
అసర్: సాయంత్రం 4:38 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:24 గంటలకు
ఇష: రాత్రి 7.37 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 8, 2024
అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే విందులు చేసుకున్నావ్: టీడీపీ
AP: అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 50 మంది చనిపోతే మాజీ CM జగన్ హైదరాబాద్‌లో విందులు, వినోదాల్లో మునిగితేలారని టీడీపీ ఆరోపించింది. ప్రజలను నువ్వు ఆదుకోవు, ఇతరులను ఆదుకోనివ్వవు అని ట్విటర్‌లో విమర్శించింది. ‘నీ అడ్రస్ గల్లంతు చేసిన ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నావు. ఎప్పటికైనా లండన్‌లో స్థిరపడే నీకు మా రాష్ట్రం గురించి ఆలోచించే గుణం నీకెక్కడిది? నీదంతా కుళ్లు, కుతంత్రాలు, శవ రాజకీయాలు’ అని మండిపడింది.