News August 5, 2024
భారీగా తగ్గిన చికెన్ ధరలు
TG: గత కొద్ది రోజులుగా చికెన్ ధరలు పడిపోతున్నాయి. HYD నగరంలో 3 వారాల క్రితం రూ.280 నుంచి రూ.300 వరకు ఉన్న కేజీ చికెన్ ఇప్పుడు రూ.180కి చేరింది. కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.150కే అమ్ముతున్నారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో చికెన్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. మరి మీ ప్రాంతంలో కేజీ చికెన్ ధర ఎంత ఉందో కామెంట్ చేయండి.
Similar News
News September 10, 2024
తిన్న వెంటనే ఈ పనులు చేస్తే ముప్పు తప్పదు!
భోజనం చేశాక కొన్ని పనులు చేయొద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తిన్న తర్వాత:
స్నానం చేయొద్దు. శరీరంలో ఉష్ణోగ్రత మార్పు అరుగుదలపై ప్రభావం చూపిస్తుంది. ఎక్కువ నీరు తాగొద్దు. దీని వలన ఒంట్లో టాక్సిన్లు పెరుగుతాయి. కాఫీ, టీ తాగొద్దు. వీటిలోని కొన్ని ఆమ్లాలు, ఆహారంలోని బలాన్ని తీసుకోనివ్వకుండా అడ్డుపడొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోవద్దు. డయాబెటిస్, ఊబకాయం, అజీర్తి వంటి సమస్యలు రావొచ్చు.
News September 10, 2024
కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు: సీఎం రేవంత్
TG: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్ర మరవలేనిదని కొనియాడారు. ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. భూముల ఆక్రమణలు అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమె స్ఫూర్తి అని చెప్పారు. ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.
News September 10, 2024
మీ స్మార్ట్‌ఫోన్ రేడియేషన్ తెలుసుకోండిలా..!
మొబైల్ ఫోన్ల నుంచి రేడియేషన్ వెలువడుతుందన్న సంగతి తెలిసిందే. అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలని చాలామంది భావిస్తుంటారు. దీన్ని స్పెసిఫిక్ అబ్జార్షన్ రేట్(SAR) ద్వారా తెలుసుకోవచ్చు. దీన్ని ఫోన్ కొన్నప్పుడు ఇచ్చే యూజర్ మాన్యువల్ లేదా ఆ సంస్థ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. లేదంటే మీ ఫోన్లో *#07# డయల్ చేసినా ఆ వివరాల్ని తెలుసుకోవచ్చు.