News September 1, 2024
తెలుగు రాష్ట్రాల్లో భారీగా రైళ్ల రద్దు, మళ్లింపు
TG: మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ <<13990198>>ధ్వంసం <<>>కావడంతో ఏపీ, తెలంగాణలో ఇవాళ, రేపు ప్రయాణించే పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. దాదాపు 70కి పైగా రైళ్లను అధికారులు దారి మళ్లించి నడుపుతున్నారు. రద్దయిన, దారి మళ్లిన రైళ్ల వివరాలను పైన ఫొటోల్లో చూడవచ్చు. అటు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌కు రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపడుతున్నారు. పూర్తయ్యేందుకు మరికొన్ని గంటలు పట్టే అవకాశం ఉంది.
Similar News
News September 10, 2024
‘దేవర’ సునామీ బలంగా తాకనుంది.. సిద్ధంగా ఉండండి: మేకర్స్
జూ.ఎన్టీఆర్-జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర’ మూవీ ట్రైలర్ రేపు సా.5.04కు విడుదల కానుంది. దీనికి సంబంధించి మరో అప్డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏ యూట్యూబ్ ఛానల్‌లో ట్రైలర్ విడుదల కానుందో తెలిపారు. ‘ప్రతిసారీ ఆయన ఏం చేసినా చరిత్ర అవుతుంది. ఈసారి ఆయన అన్ని ప్రాంతాలకు ఓ నోటీస్ పంపారు. సిద్ధంగా ఉండండి. దేవర అనే సునామీ బలంగా తాకనుంది’ అని రాసుకొచ్చారు.
News September 10, 2024
పంత్ టెస్ట్ క్రికెట్ దిగ్గజం అవుతాడు: గంగూలీ
టీమ్ ఇండియాలో ప్రస్తుతమున్న అత్యుత్తమ టెస్టు బ్యాటర్లలో రిషభ్ పంత్ కూడా ఒకడని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. బంగ్లాతో టెస్టులకు పంత్ ఎంపికైన నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘రిషభ్ తిరిగి జట్టులోకి రావడం నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. మున్ముందు భారత్ టెస్టు ఆటగాళ్లలో తను ఓ దిగ్గజమవుతాడు. పొట్టి ఫార్మాట్లలో మాత్రం పంత్ మరింత మెరుగవ్వాల్సి ఉంది’ అని పేర్కొన్నారు.
News September 10, 2024
ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ హోదానా? సిగ్గు.. సిగ్గు: KTR
TG: ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన <<14061145>>పీఏసీ ఛైర్మన్ <<>>పదవిని, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి? అని కేటీఆర్ నిలదీశారు. ‘పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం. గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోంది. పార్లమెంట్‌లో పీఏసీ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్‌కు కట్టబెట్టిన విషయం మరిచారా?’ అని Xలో కేటీఆర్ ప్రశ్నించారు.