News December 1, 2024
భారీ ఎన్కౌంటర్.. మృతిచెందిన ఏడుగురు మావోలు వీరే

TG: ములుగు జిల్లా చల్పాక సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన <<14757563>>భారీ ఎన్కౌంటర్లో<<>> ఏడుగురు మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. వీరు ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీకి చెందిన వారని పోలీసులు గుర్తించారు. మృతుల్లో బద్రు, మల్లయ్య, కరుణాకర్, జమున, జైసింగ్, కిశోర్, కామేశ్ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 ఏళ్లలో ఇదే అతి పెద్ద ఎన్కౌంటర్ అని సమాచారం.
Similar News
News January 4, 2026
రోజూ 6-7 లీటర్ల పాలిచ్చే ఆవుకు ఎంత మేత ఇవ్వాలి?

సంకర జాతి పశువులకు వాటి పాల ఉత్పత్తిని బట్టి దాణాను అందించాలని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. రోజుకు 6 నుంచి 7 లీటర్ల పాలిచ్చే సంకరజాతి ఆవుకు ఈత ఈనిన తర్వాత లేదా పాలిచ్చే రోజుల్లో రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 5 నుంచి 6 కేజీల ఎండుగడ్డి, 3 నుంచి 3.5 కిలోల దాణా మిశ్రమం ఇవ్వాలి. అలాగే ఇదే పశువు వట్టిపోయిన సమయంలో రోజుకు 15-20 కేజీల పచ్చగడ్డి, 6-7 కేజీల ఎండుగడ్డి, 0.5-1 కేజీ దాణా మిశ్రమం ఇవ్వాలి.
News January 4, 2026
ESIC బిబ్వేవాడిలో 20 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 4, 2026
ఆరోగ్యానికి బాదం ఇచ్చే 6 అద్భుత ప్రయోజనాలు!

పోషకాల గని అయిన బాదం తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి బ్లడ్ షుగర్ను కంట్రోల్ చేస్తాయి. ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తూ బరువు తగ్గడానికి సాయపడతాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి, చర్మం, జుట్టు మెరిసేలా చేస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రాత్రంతా నానబెట్టి పొట్టు తీసి తింటే అందులోని విటమిన్లు, మినరల్స్ ఒంటికి బాగా పడతాయి.


