News August 23, 2024
భారీ వర్షం

హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండ కొట్టగా కొద్దిసేపటి క్రితం వర్షం మొదలైంది. కొండాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, యూసుఫ్గూడ, ఫిల్మ్నగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. మీ ప్రాంతంలోనూ వర్షం కురుస్తోందా? కామెంట్ చేయండి.
Similar News
News November 25, 2025
ఏంటయ్యా రాహుల్.. ఏంటీ ఆట!

వెరీ టాలెంటెడ్ బ్యాటర్ అని పేరు తెచ్చుకున్న కేఎల్ రాహుల్ టెస్టుల్లో దారుణంగా విఫలం అవుతున్నారు. తాజాగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులోనూ కీలక సమయంలో చేతులెత్తేశారు. 2 ఇన్నింగ్సుల్లో కలిపి 28 రన్సే చేశారు. దీంతో టెస్టుల్లో అతడి యావరేజ్ 35.86కి పడిపోయింది. కీలక సమయాల్లో జట్టును ఆదుకోనప్పుడు ఎంత టాలెంట్ ఉండి ఏం లాభమని నెటిజన్లు మండిపడుతున్నారు. అతడిని పక్కనబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
News November 25, 2025
300 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(OICL) 300 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 10న టైర్ 1ఎగ్జామ్, ఫిబ్రవరి 25న టైర్ 2 ఎగ్జామ్ నిర్వహించనున్నారు. విద్యార్హతలు, వయసు తదితర వివరాలు పూర్తి స్థాయి నోటిఫికేషన్లో వెల్లడించనున్నారు. వెబ్సైట్: https://orientalinsurance.org.in
News November 25, 2025
రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు

AP: రాష్ట్రంలో మరో మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం (రంపచోడవరం కేంద్రం) జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర, నక్కపల్లి రెవెన్యూ డివిజన్లకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.


