News August 23, 2024
భారీ వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండ కొట్టగా కొద్దిసేపటి క్రితం వర్షం మొదలైంది. కొండాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, ఫిల్మ్‌నగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. మీ ప్రాంతంలోనూ వర్షం కురుస్తోందా? కామెంట్ చేయండి.
Similar News
News September 10, 2024
లో బర్త్ రేట్ ఎఫెక్ట్: అక్కడ డాగ్ స్ట్రోలర్లే అధికం
సంతానోత్పత్తి రేటు క్షీణించడంతో సౌత్ కొరియా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోంది. 2022లో ఒక్కో మహిళకు సగటున పుట్టే పిల్లల సంఖ్య 0.78 కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 0.72 లేదా 0.68కి పడిపోవచ్చని అంచనా. ఇప్పుడు ఆ దేశంలో బేబీ స్ట్రోలర్స్(43%) కంటే డాగ్ స్ట్రోలర్స్(57%) అధికంగా అమ్ముడవుతుండటం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. పిల్లులు, కుక్కలను పెంచుకునేవారి సంఖ్య 2012లో 3.6M ఉండగా, గత ఏడాది ఆ సంఖ్య 6Mకు చేరింది.
News September 10, 2024
జైనూర్ ఘటనలో ప్రభుత్వానికి NHRC నోటీసులు
TG: ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్‌లో మహిళపై అత్యాచార <<14027592>>ఘటనలో<<>> రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో దీనిపై వివరణ ఇవ్వాలని సీఎస్, డీజీపీని ఆదేశించింది. కాగా అత్యాచార ఘటనను NHRC సుమోటోగా స్వీకరించింది.
News September 10, 2024
APPLY NOW: దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు
స్పోర్ట్స్ కోటాలో 67 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (సికింద్రాబాద్) ప్రకటించింది. SEP 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని, అక్టోబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. మహిళలు, పురుషులకు అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, చెస్, వెయిట్ లిఫ్టింగ్, క్రికెట్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ తదితర కేటగిరీల్లో <