News August 8, 2024
అర్ధరాత్రి భారీ వర్షం
TG: అర్ధరాత్రి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, అత్తాపూర్, టోలిచౌకి ఏరియాల్లో వాన దంచికొట్టింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. నిన్న గద్వాల జిల్లా గట్టులో అత్యధికంగా 12.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అటు భద్రాచలం సైతం నీటమునిగింది.
Similar News
News September 19, 2024
ప్రకాశం బ్యారేజ్ నుంచి రెండో పడవ తొలగింపు
AP: ప్రకాశం బ్యారేజ్‌ను ఢీకొట్టిన రెండో పడవను ఎన్నో రోజుల ప్రయత్నం తర్వాత ఇవాళ విజయవంతంగా తొలగించారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపి బ్యారేజీ ఎగువకు తరలించారు. బ్యారేజీ వద్ద ఇంకా బోల్తా పడి ఉన్న మరో భారీ, మోస్తరు పడవ రేపు ఒడ్డుకు తరలిస్తామని ఇంజినీర్లు వెల్లడించారు.
News September 19, 2024
అత్యంత ఖరీదైన బియ్యం.. కిలో రూ.15వేలు!
మార్కెట్‌లో ఎన్నో బియ్యం రకాలున్నాయి. ప్రస్తుతం సాధారణ సన్న బియ్యం ధర క్వింటాకు రూ.5-6 వేలు ఉండొచ్చు. అయితే, అత్యంత ఖరీదైన బియ్యాన్ని జపనీయులు పండిస్తున్నారన్న విషయం తెలుసా? జపనీస్ కిన్మెమై రైస్ కిలోకు రూ.15వేలు ధర ఉంటుంది. పేటెంట్ పొందిన కిన్మెమై పద్ధతిని ఉపయోగించి దీనిని పండిస్తారు. ఈ ప్రీమియం రైస్‌లో ఉన్నతమైన రుచి, పోషక విలువలు ఉన్నాయి. జపాన్ వీటిని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తోంది.
News September 19, 2024
వాయు కాలుష్యంతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు
వాయు కాలుష్యంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఎక్కువని భారత్ సహా పలు దేశాల పరిశోధకులు చేసిన సంయుక్త అధ్యయనంలో తేలింది. ‘బ్రెయిన్ స్ట్రోక్’ మరణాల్లో 14శాతం వాయు కాలుష్యం వల్లేనని వారు పేర్కొన్నారు. గగనతల కాలుష్యం, ఉష్ణోగ్రతల పెరుగుదల వలన గత 3 దశాబ్దాల్లో మెదడు సంబంధిత మరణాలు బాగా పెరిగాయని వివరించారు. బ్రెయిన్ స్ట్రోక్ బాధితుల సంఖ్య 1990తో పోలిస్తే 2021 నాటికి 70 శాతం పెరిగిందని తెలిపారు.