News March 22, 2025
హైదరాబాద్లో భారీ వర్షం

TG: హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, హైదర్ నగర్, నిజాంపేట్ తో పాటు నగరంలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులతో భారీగా గాలులు వీయడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ వర్షం పడిన సంగతి తెలిసిందే.
Similar News
News March 22, 2025
BREAKING: కాసేపట్లో భారీ వర్షం

TG: రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి 11 గంటల వరకు మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 41-61 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. రంగారెడ్డి, సిద్దిపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
News March 22, 2025
వైసీపీ పాలనలో రైతులకు ఇబ్బందులు: నాదెండ్ల

AP: రైతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. వైసీపీ పాలనలో పంటలు అమ్ముకునేందుకు అన్నదాతలు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. తాము ఇప్పటి వరకు రూ.8వేల కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు తెలిపారు. 17-20 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతుల అకౌంట్లలో 24 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు.
News March 22, 2025
IPL: మీ కుటుంబాన్ని రోడ్డున పడేయకండి!

ఈజీగా డబ్బులు సంపాదించేందుకు కొందరు బెట్టింగ్కు మొగ్గుచూపుతుంటారు. ముఖ్యంగా IPL వేళ విపరీతంగా డబ్బులు చేతులు మారుతుంటాయి. ఎవరో ఒకరు బెట్టింగ్లో డబ్బులు గెలుచుకున్నారనే వెర్రితనంతో మీరూ ఆ వలలో చిక్కుకోకండి. ఈ మహమ్మారి వలలో పడి ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రసవత్తరంగా సాగే మ్యాచులను చూసి ఎంజాయ్ చేయండి. కానీ బెట్టింగ్ జోలికి వెళ్లకండి. DONT ENCOURAGE BETTING