News March 22, 2025

హైదరాబాద్‌లో భారీ వర్షం

image

TG: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, హైదర్ నగర్, నిజాంపేట్ తో పాటు నగరంలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులతో భారీగా గాలులు వీయడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ వర్షం పడిన సంగతి తెలిసిందే.

Similar News

News April 21, 2025

నక్సలిజం అంతమయ్యే వరకూ దాడులు ఆపం: అమిత్ షా

image

నక్సలిజాన్ని తుదముట్టించేంత వరకూ భద్రతా బలగాల దాడులు కొనసాగుతాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. ఝార్ఖండ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో రూ.కోటి రివార్డున్న వివేక్ అనే మావోయిస్టుతో పాటు మరో ఇద్దరు అగ్రనేతలు మృతి చెందారని తెలిపారు. నక్సల్స్ ఏరివేతలో భద్రతా బలగాలు విజయం సాధించాయన్నారు. కాగా 2026 మార్చి 31 కల్లా నక్సల్ రహిత దేశంగా భారత్‌ నిలుస్తుందని అమిత్‌షా ప్రకటించిన సంగతి తెలిసిందే.

News April 21, 2025

‘లగచర్ల’లో మేం చెబుతున్న విషయాన్నే NHRC బయటపెట్టింది: కేటీఆర్

image

TG: లగచర్ల ఘటనలో ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లుగా జాతీయ మానవ హక్కుల సంఘం నివేదిక ఇచ్చిందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘ఇంతకాలంగా మేం చెబుతున్నదీ అదే. లగచర్లలో రైతులు, మహిళల పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. మానవ హక్కుల హననానికి పాల్పడ్డారు. ఆ విషయాన్నే నివేదిక ఖరారు చేసింది. సర్కారుపై పోరాడిన గిరిజనులందరికీ అభినందనలు’ అని తెలిపారు.

News April 21, 2025

తులం బంగారం @రూ.1,00,000

image

బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. భారత లైవ్ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.లక్షను తాకినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అయితే, హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.99,860గా ఉన్నట్లు తెలిపారు. రేపటి వరకు రూ.లక్ష దాటే అవకాశం ఉందని వెల్లడించారు. అటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్స్ బంగారం ధర $3404 దాటినట్లు వెల్లడించారు. దీనికి అమెరికా- చైనా టారిఫ్ యుద్ధమే కారణమంటున్నారు.

error: Content is protected !!